కేంద్ర ప్రభుత్వంపెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి..

వేములవాడ :కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ 50 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ 350 రూపాయలు పెంచడాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ గురువారం వేములవాడ పట్టణంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో ఫ్లకార్డ్ పట్టుకొని నిరసన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం వేములవాడ డివిజన్ కన్వీనర్ ఎరవెల్లి నాగరాజు మాట్లాడుతూ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

 Central Government Should Withdraw Cooking Gas Prices , Central Government , V-TeluguStop.com

బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 450 రూపాయలు ఉన్నటువంటి వంటగ్యాస్ ధర బిజెపి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 1200 రూపాయల పైన పెంచడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంటగ్యాస్ ధర పెంచితే లబోదిబో మని మొత్తుకున్న మంత్రి స్మృతీ ఇరానీ, నరేంద్ర మోడీ లు గ్యాస్ ధరలు పెంచిన దానికి సమాధానం చెప్పాలని అన్నారు.అధికారంలో ఉంటే ఒక విధానం అధికారంలో లేకుంటే మరొక విధానం అవలంబించే బిజెపి పార్టీ ప్రజలకు మేలు చేయడం కన్నా కీడు చేయడమే తన విధానమని ప్రజల సంపద మొత్తం బడా పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి ఈ బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

ప్రజలు ఇప్పటికైనా బీజేపీ విధాలపై వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో బిజెపికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ముక్తికాంత అశోక్, మల్లారపు ప్రశాంత్, నాయకులు పర్శరాములు,ప్రవీణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube