రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట లో గత నాలుగు నెలలుగా పని చేసిన తమకు ఉపాధి హామీ డబ్బులు రావడం లేదని పేర్కొంటూ మండల కేంద్రము లోని కిషన్ దాస్ పేట కు చెందిన శివరాత్రి వారి సంఘం ఉపాధి కూలీలు సోమవారం ఉపాది హామీ కూలీలు ఉపాధి హామీ కార్యాలయానికి వచ్చి టెక్నికల్ అధికారి రాజు కు వినతి పత్రం సమర్పించారు.
కిషన్ దాస్ పేట లోని జంగమొని పట్టే,పల్లె ప్రకృతి వనం,భక్తి సంఘం కాలువ,సర్వాయి పల్లె నుండి దనం గుండు వరకు కాలువ తీసినామనీ, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఉన్న చోట చెట్లకు నీళ్ళు పట్టిన డబ్బులు నాలుగు నెలల నుండి డబ్బులు రావడం లేదని లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
వీరికి బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు దొమ్మటి నర్సయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి, ఎల్లారెడ్డి పేట Yellareddipeta )మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్</em( Oggu balaraju yadav ), కాంగ్రెస్ నాయకులు పుల్లయ్య గారి తిరుపతి,గంట ఆంజ గౌడ్,బుచ్చి లింగు సంతోష్ గౌడ్ లు ఉపాధి కూలీలకు సంఘీ భావం తెలిపారు.