ఇన్‌స్టాగ్రామ్( Instagram ) అనేది యువ తరాన్ని ఆకట్టుకునే ప్రముఖ సోషల్ మీడియా యాప్.ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో రాబోయే కొన్ని అప్‌డేట్‌లు ఇక్కడ ఉన్నాయి:
– నోట్స్ ఆడియో, షార్ట్ వీడియోలు
ఈ ఫీచర్ 2022లో లాంచ్ అయింది.వినియోగదారులు టెక్స్ట్, ఎమోజీలను నోట్స్‌గా( Notes ) పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది.
అయితే త్వరలో , ఇన్‌స్టాగ్రామ్ నోట్స్‌లో( Instagram Notes ) ఆడియో మెసేజెస్, షార్ట్ వీడియోలను చేర్చే ఎంపికను జోడించనుంది.వినియోగదారులు వాటిని నోట్స్‌గా రికార్డ్ చేసి పోస్ట్ చేయవచ్చు, ఇది DM లిస్ట్ పైన కనిపిస్తుంది.
నోట్స్ లొకేషన్ ట్యాగ్‌లను కూడా కలిగి ఉండవచ్చు, అవి టెక్స్ట్ పై చూపబడతాయి.నోట్స్ రూపొందించడానికి, యూజర్లు DM ట్యాబ్‌కి వెళ్లి ‘యువర్ నోట్’పై క్లిక్ చేయాలి.
నోట్స్ 24 గంటల పాటు లైవ్ లో ఉంటాయి.
– బర్త్‌డే రిమైండర్లు
ఈ ఫీచర్ ఫేస్‌బుక్ అందించిన బర్త్‌డే రిమైండర్( Birthday Remainder ) మాదిరిగానే ఉంటుంది.వినియోగదారులకు వారి స్నేహితులు, ఫాలోవర్ల బర్త్‌డేలను తెలియజేస్తుంది.ఇన్‌స్టాగ్రామ్ కొన్ని ప్రీ-మేడ్ రీల్స్, పోస్ట్‌లను కూడా అభివృద్ధి చేస్తోంది, వీటిని వినియోగదారులు పుట్టినరోజు శుభాకాంక్షలుగా పంపవచ్చు.
– కష్టమైస్డ్ లిస్ట్స్
ఈ ఫీచర్ యూజర్లు సన్నిహిత మిత్రులతో పాటు వారి స్టోరీస్ పంచుకోవాలనుకునే వ్యక్తుల విభిన్న లిస్ట్‌లను రూపొందించడానికి అనుమతిస్తుంది.యూజర్లు కుటుంబం లేదా ఆఫీస్ వంటి వర్గాల ఆధారంగా లిస్ట్స్ తయారు చేయవచ్చు.వారికి మాత్రమే కనిపించే స్టోరీస్ పోస్ట్ చేయవచ్చు.తద్వారా ప్రైవసీ మెరుగుపరచుకోవచ్చు.