రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరోగ్యకర ప్రజాస్వామ్య నిర్మాణానికి ఒక్కటవుదామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) పేర్కొన్నారు.జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది తో కలిసి కలెక్టర్ గురువారం ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు( Assembly election ) విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులను అభినందించారు.
ఎన్నికల ప్రక్రియ నిరంతరం ఉంటుందని, నిజాయితీగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు నిరంతరం ప్రజలతో మమేకం అవుతారని, ఈ సందర్భంగా యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా, ఓటు వేసేలా ప్రోతహించాలని పిలుపు నిచ్చారు.
సీనియర్ ఓటర్లకు సన్మానం జాతీయ ఓటరు దినోత్సవం( National Voters Day ) సందర్భంగా సమీకృత కార్యాలయాల సముదాయంలో సీనియర్ ఓటర్లను అదనపు కలెక్టర్ పూజారి గౌతమి( Gouthami Poojari ) సన్మానించారు.అలాగే పలువురు నూతన ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
కార్యక్రమాల్లో సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఎస్డీసీ గంగయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.