ప్రస్తుత రోజుల్లో అధిక బరువు ( Overweight )అనేది కోట్లాది మంది పాలిట అతిపెద్ద శత్రువు గా మారింది.అయితే అందరిలోనూ బరువు పెరగడానికి ఒకే రకమైన కారణాలు ఉండవు.
ప్రధానంగా చూసుకుంటే శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం, కంటి నిండా నిద్ర లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు శరీర బరువును అదుపు తప్పేలా చేస్తాయి.దాంతో పెరిగిన బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ జోలికి అస్సలు పోకండి.
ఈ లిస్టులో మొదట చెప్పుకోవాల్సింది శీతల పానీయాలు.తాగడానికి రుచిగానే ఉన్న వీటిలో చక్కెర, కేలరీలు అధిక మొత్తంలో ఉంటాయి.పోషకాల పరంగా చూస్తే సున్నా అని చెప్పవచ్చు.శీతల పానీయాలు తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అందకపోగా మీ పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోతుంది.పైగా వెయిట్ లాస్ కూడా అవ్వలేరు.అలాగే కాఫీ చాలా మందికి ఫేవరెట్ డ్రింక్ గా చెప్పుకోవచ్చు.
ఉదయం లేవగానే కప్పు కాఫీ తోనే రోజును ప్రారంభించే వారు ఎంతో మంది ఉన్నారు.అయితే బరువు తగ్గాలనుకునేవారు కాఫీకి దూరంగా ఉండడమే మంచిది.
కాఫీ( Coffee )లో ఉపయోగించే పాలు చక్కెర మన బాడీలో కేలరీలను పెంచుతాయి.ఒకవేళ మీరు తాగాలి అనుకుంటే బ్లాక్ కాఫీ( Black Coffee )ని ఎంపిక చేసుకోవచ్చు.
ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యానికి మంచివని భావిస్తుంటారు.కానీ నిజానికి ఫ్రూట్స్ జ్యూసులు గా మారే క్రమంలో అవి వాటి ఫైబర్ కంటెంట్ ను కోల్పోతాయి.పైగా జ్యూసుల తయారీలో షుగర్ ను అధికంగా వాడతారు.కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు పండ్లను జ్యూసుల రూపంలో కాకుండా నేరుగా తీసుకోవడం ఎంతో ఉత్తమం.
వెయిట్ లాస్ కు ప్రయత్నిస్తుంటే బీర్, కాక్ టెయిల్ వంటి డ్రింక్స్ కు దూరంగా ఉండండి.ఇవి బరువు తగ్గడానికి ఆటంకాన్ని కలిగిస్తాయి.పిల్లల నుంచి పెద్దల వరకు మిల్క్ షేక్‌లను ఎంతో ఇష్టంగా తాగుతుంటారు.అయితే మిల్క్ షేక్స్‌లో కేలరీలు చాలా అధికంగా ఉంటాయి.
వీటిని తీసుకోవడం వల్ల మీరు మరింత వెయిట్ గెయిన్ అవుతారు జాగ్రత్త.