వేరుశెనగలు( Peanuts ). వీటినే పల్లీలు అని కూడా పిలుస్తుంటారు.
దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో చట్నీ, తాలింపుల కోసం వేరుశెనగలను విరివిరిగా వాడుతుంటారు.వేరుశెనగలు రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను సైతం కలిగి ఉంటాయి.
కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఎ, ప్రోటీన్, ఫైబర్ ఇలా మరెన్నో పోషకాలు వేరుశెనగలు ద్వారా పొందవచ్చు.అయితే వీటిని చట్నీ, తాలింపు ద్వారా కంటే ఉడికించి తినడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఉడికించిన పల్లీలు( Boiled Peanuts ) ఆరోగ్యకరమైన చిరుతిండి గా చెప్పుకోవచ్చు.వేరుశెనగలను ఉడికించి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి. కొలెస్ట్రాల్( Cholestrol ) ను కరిగించి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.అలాగే ఉడికించిన పల్లీల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.అందువల్ల మధుమేహం ఉన్నవారికి ఇవి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పుకోవచ్చు.ఉడికించిన వేరుశెనగలను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.ఉడికించిన వేరుశెనగల్లో ప్రోటీన్ మరియు ఫైబర్ రిచ్ గా ఉంటాయి.అందువల్ల ఇవి బరువు నిర్వహణలో సహాయపడతాయి.అతి ఆకలిని దూరం చేస్తాయి.కడుపును నిండుగా ఉంచుతాయి.
మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గడానికి( Weight Loss ) తోడ్పడతాయి.అంతేకాదు ఉడికించిన పల్లీలను డైట్ లో చేర్చుకోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది.
బ్రెయిన్ సూపర్ షార్ప్ గా పనిచేస్తుంది.అల్జీమర్స్( Alzheimers ) వచ్చే రిస్క్ తగ్గుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.మరియు ఎముకలు సైతం దృఢంగా గట్టిగా ఉంటాయి.ఇన్ని ఆరోగ్య లాభాలు అందిస్తున్నాయి కాబట్టి ఉడికించిన వేరుశెనగలను డైట్ లో చేర్చుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.మీరు ఉడికించిన పల్లీలను నేరుగా తినవచ్చు.
లేదా సలాడ్స్, సూపుల్లో యాడ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు.