సినిమా ఇండస్ట్రీలో హీరోలదే డామినేషన్ అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం కూడా హీరోకి వెళ్తుంది.
కానీ పొరపాటున ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ బాధ్యత దర్శకుడి( Director ) భుజాలపై పడుతుంది.అదే ఈ సినిమా ఇండస్ట్రీ యొక్క గొప్పతనం.
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాని మార్కెట్ చేయాలంటే ఖచ్చితంగా హీరో పేరు చెప్పుకొని చేయాలి.అందువల్లే ఆయన పేరుకు అంతా క్రేజ్ ఉంటుంది.
కానీ సినిమాకి సంబంధించిన అంతవరకు దర్శకుడు మాత్రమే కెప్టెన్ … ఆయనే అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఒక సినిమాకి హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు ? దానికి సంబంధించిన టెక్నీషియన్స్( Technicians ) అందరినీ కూడా దర్శకుడు మాత్రమే నియమిస్తాడు.ఇలా సినిమాను ముందుంచి నడిపించే దర్శకుడికి దక్కాల్సిన క్రెడిట్ మాత్రం దక్కడం లేదు.కానీ ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి.
కొన్నేళ్లకు ముందు దర్శకుడు నిర్మాత మాత్రమే తారస్థాయిలో ఉండేవారు.మిగతా వారంతా నెల జీవితాలకు పని చేసేవారు కాబట్టి వారు ఏం చెబితే నటీనటులు అదేవిధంగా నడుచుకునే వారు.
ఆ పరిస్థితికి పూర్తిగా విరుద్ధమైన పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది.

దర్శకుడు ఒకసారి కథ చెబితే ఆ కథను నమ్ముకుని సినిమాలో నటించే హీరోలు ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు.అందులో చెప్పుకోవాల్సింది మొదటగా మహేష్ బాబు ( Mahesh Babu )గురించి.మహేష్ బాబు ఒక్కసారి కథ విని ఓకే చేశాక దర్శకుడు కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు.
అంతగా దర్శకుడు చెప్పింది చేస్తాడు అందుకే మహేష్ బాబు చిత్రాల్లో కొన్ని దారుణమైన డిజాస్టర్స్ కూడా వచ్చాయి.ఇక మహేష్ బాబు తర్వాత ప్రభాస్( Prabhas ) మాత్రమే అలాంటి అలవాట్లు కలిగి ఉన్నాడు.
తాజాగా ఆది పురుష్ సినిమా అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.దర్శకుడుని పూర్తిగా నమ్మటమే ఈ హీరోలు చేసే పని.మహేష్ బాబుకు బ్రహ్మోత్సవం, ప్రభాస్ కి ఆది పురుషులు డిజాస్టర్లు అందుకే దక్కాయి.