యాదవుల సమస్యలను పరిష్కరించండి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో డబల్ బెడ్ రూమ్ లకు ఎదురుగా సుమారు 20 సంవత్సరాల క్రితం మండల యాదవ సంఘం కోసం కొనుగోలు చేసిన భూమినీ మండల యాదవ సంఘం భవన నిర్మాణం కోసం ఆప్పగించాలని కోరుతూ ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ రామచంద్రం కు వినతి పత్రం సమర్పించారు.అదే విధంగా గ్రామాల్లో గొర్రెలు మేకలు మెపుకోవడానికి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జి.

 Solve The Problems Of Yadavs, Yaadava Sangham, Yaadava Sangham Building, Rajanna-TeluguStop.com

ఓ నెంబర్ 540 ప్రకారం గొర్రెలు మేకల పెంపకం కోసం అయిదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని,

అదే విధంగా కల్లు గీత,చేనేత కార్మికుల కు 50 సంవత్సరాల కే ఇస్తున్న మాదిరిగా మా గొర్రెల పెంపకం దారుల కు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని కోరుతూ మండల తహశీల్దారు కు వినతి పత్రం అందజేశారు.ప్రభుత్వం దృష్టికి ఇట్టి సమస్యను నివేదిస్తానని మండల తహశీల్దార్ రామచంద్రం పేర్కొన్నారు.15 రోజుల లోపు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న యాదవుల భూమినీ యాదవ సంఘం భవన నిర్మాణం కోసం కేటాయించాలని లేనిచో దశల వారీగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఒగ్గు బాలరాజు యాదవ్, బుర్రవేణి నాగరాజు యాదవ్, పెద్ద వేణి రాజు యాదవ్, మందాటి సతీష్ యాదవ్, ఒగ్గు మహేష్ యాదవ్,ప్రవీణ్ యాదవ్, వినేష్ యాదవ్, సిహెచ్ ఎల్లయ్య యాదవ్, కుమార్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, రమేష్ యాదవ్, రమేష్ యాదవ్, ఎం సతీష్ యాదవ్, మందాటి లక్ష్మణ్ యాదవ్, మానుక నాగరాజు యాదవ్,బింగి రమేష్ యాదవ్, ఎన్ సురేష్ యాదవ్, ఏం బాబు యాదవ్, బీపేట మనోజ్ యాదవ్, ఎం వెంకటేష్ యాదవ్, ఎం మల్లేశం యాదవ్, బి గంగయ్య యాదవ్, టి కార్తీక్ యాదవ్, యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube