రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల పట్టణం బి వై నగర్ కు చెందిన కే .గిరి అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రి( NIMS Hospital )లోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 3,00,000/- రూపాయలు మంజూరు చేపించారు.
అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.