రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం( Mudiraj Welfare Society ) ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం ముదిరాజ్ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడు గా జంగపెల్లి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గా వంకాయల భాస్కర్, గౌరవ అధ్యక్షులు గా దేవుని నర్సయ్య, ప్రధాన కార్యదర్శి కూనవేణి పర్శరాము ముదిరాజ్ లను జిల్లా సంక్షేమ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రానవేణి లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాలో ముదిరాజ్ ఐక్యత మొదలైందని అన్నారు.
మొన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) కేంద్రం లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు కోడి అంతయ్య జిల్లా ముదిరాజ్ లు మద్దతు తెలుపుతున్నారని ఓ తీర్మానం కాపీని కేసీఆర్ కు అందిచడాన్ని జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.జిల్లా నుండి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి మద్దతు తెలియజేయలేదని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ కి మా ఓట్లు కావాలే గాని మేము అక్కర లేదని పార్టీ పై మండిపడ్డారు.13 మండలాల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులతో మాట్లాడిన తర్వాతనే మా భవిష్యత్తు కార్యాచరణ మద్దత్తు ను ప్రకటిస్తామని అన్నారు.