1.వంట నూనె ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు
దేశంలో వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.2022 – 24 ఆర్థిక సంవత్సరంలో నూనె దిగుమతిపై పన్ను విధించబోమని కేంద్రం ప్రకటించింది.
2.నేడు భారత్ బంద్
కులాల వారిగా జనాభా నన్ను కోరుతూ నేడు భారత్ బంద్ కు ఆలిండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.
3.రేపు హైదరాబాద్ కు ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ కు రానున్నారు.
4 భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,124 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.నేడు సీబీఐ విచారణకు కార్తీ చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ రైటర్ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నేడు సీబీఐ విచారణకు హాజరు కానున్నారు.చైనీస్ వీసా కుంభకోణంలో కార్తీ చిదంబరం ను సిబిఐ అధికారులు విచారించనున్నారు.
6.కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కపిల్ సిబాల్
కాంగ్రెస్ సీనియర్ లీడర్ గా ఉన్న కపిల్ సిబాల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.సమాజ్వాదీ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
7.స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ పై సైబర్ దాడి
భారతదేశంలో విమాన సర్వీసులను అందిస్తున్న స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ పై అర్ధరాత్రి సైబర్ దాడి జరిగింది.దీంతో ఈరోజు ఉదయం కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి.
8.సద్గురు జగ్గీ వాసుదేవ్ తో మంత్రి కేటీఆర్ చర్చ
గౌస్ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లోనే తెలంగాణ పెవిలియన్ లో మంత్రి కేటీఆర్ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ సమావేశమయ్యారు.
9.రజనీకాంత్ ఇళయరాజా బేటీ
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భేటీ అయ్యారు.
10.ఈ నెల 31 నుంచి టాస్ పరీక్షలు
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ( టాస్ ) టెన్త్ ఇంటర్ వార్షిక పరీక్షలను ఈనెల 31 నుంచి నిర్వహించనున్నారు.
11.తెలంగాణ ప్రభుత్వం పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు
తెలంగాణ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని జగ్గా రెడ్డి డిమాండ్ చేశారు.
12.ప్రధాని పర్యటన… గచ్చిబౌలిలో పోలీస్ ఆంక్షలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా గచ్చిబౌలి లో పోలీసులు ఆంక్షలు విధించారు.
13.బెంగళూరుకు కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ నెట్ సాయంత్రానికి బెంగళూరుకు చేరుకోనున్నారు.రేపు బెంగళూరు నుంచి రాలె గావ్ సిద్ది వెళ్లనున్నారు.
14.నేడు దివ్యాంగుల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కోట విడుదల
నేడు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టిక్కెట్ల కోటను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.
15.నేడు మంచిర్యాల జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన
నేడు మంచిర్యాల జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు.
16.నేడు కొండగుట్ట లో హనుమాన్ జయంతి వేడుకలు
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు లో హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి.
17.నేడు రాజ్యసభ టిఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్
తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్ఎస్ అభ్యర్థుల పార్థసారధి రెడ్డి , దామోదర్ రావు నామినేషన్లు దాఖలు చేశారు.
18.అమలాపురం వ్యవహారం లో 46 మంది అరెస్ట్
అమలాపురం లో నిన్న మంత్రి, ఎమ్మెల్యే ఇంటి దహనం తో పాటు, బస్సుల దహనం ఘటనపై పోలీసులు ఏడు కేసు నమోదు చేసి 46 మందిని అరెస్టు చేశారు.
19.అమలాపురం లో ఇంటర్నెట్ సేవలు బంద్
అమలాపురంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా బంద్ చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,900 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,250
.