చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అదనపు ఎస్పీ చంద్రయ్య.ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు.
బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు మధుకర్, రమేష్ ,కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.