కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు అన్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో సంప్రదించి అప్లై చేసుకోవాలని వారు కోరారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఐదుగురు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు.ఎల్లారెడ్డిపేట గ్రామంలో జోగి భూమయ్య, గంట పద్మ,భూక్య పరశురాం,ఎం డి జహీరా బీ, మాసూరి శ్రీనివాస్ లకు సిఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ,మాజీ ఎంపిటిసి నేవూరి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు రాములు ,బండారి బాల్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రాంరెడ్డి,మండల ఉపాధ్యక్షులు గంట బుచ్చ గౌడ్ మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు ఎండి రఫీక్, మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు సంతోష్ గౌడ్, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అంతేర్పుల గోపాల్,మాజీ ఎంపిటిసి , గంట అంజయ్య గౌడ్ ,ధర్మేందర్, రవి, ధ్యాగం నారాయణ, భూక్య పరుశురాం లు తదితరులు పాల్గొన్నారు