మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటులకు అసిస్టెంట్లు అలాగే మేనేజర్లు ఉండడం అన్నది కామన్.వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మేనేజర్లు చూసుకుంటూ ఉంటారు.
అందుకే చాలా వరకు సెలబ్రిటీలు నమ్మకంగా ఉండే మేనేజర్లను మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు.కాగా కొంతమంది హీరోల విజయాల్లో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు.
తమ హీరోలకు( Heroes ) ఎలాంటి కథలు నప్పుతాయో, వాటినే అన్వేషించి, ఓపికగా కథలు విని, అందులో మంచివి ఏరుకొని, హీరో ముందుకు తీసుకెళ్లడం, ప్రాజెక్టులు సెట్ చేయడం వీళ్ల పని.ఒక హీరో కూడా అలానే ఒక అమ్మాయిని మేనేజర్‌గా( Lady Manager ) నియమించుకొన్నాడు.
ఆ హీరో కోసం కథలు వినడం, ప్రాజెక్టులు సెట్ చేయడం ఆమె పని.కానీ సదరు మేనేజర్‌కు ఏ కథా నచ్చడం లేదు.దర్శకులు, నిర్మాతలు హీరోని కలవాలంటే ముందు ఆమెను ప్రసన్నం చేసుకోవాలి.ఆమెకంటూ ఒక కోటరీ ఉంది.తన సన్నిహితులు, స్నేహితుల కథల్ని హీరోకి వినిపించే ప్రయత్నం చేస్తోంది.ఆ కథలేమో హీరోకి నచ్చడం లేదు.
ఆ హీరో పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు.తొలి సినిమా హిట్టు.
ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి అంతగా సక్సెస్ కాలేకపోయాయి.ఇలాంటి దశలో పారితోషికం( Remuneration ) గురించి పెద్దగా ఆలోచించకూడదు.
ఒక మంచి ప్రాజెక్టు సెట్ అయితే చాలనుకోవాలి.
కానీ అది కూడా జరగడం లేదు.పారితోషికం పేరు చెప్పి కూడా నిర్మాతల్ని( Producers ) భయపడేలా చేస్తోందని ఇన్ సైడ్ వర్గాల టాక్.ఆ హీరోఏమో ఏదో ఓ ప్రాజెక్ట్ సెట్ చేయ్ అంటుంటే ఈ మేనేజర్ ఏమో.
మంచి కథ రావాలి కదా అంటూ కాలక్షేపం చేస్తోందట.కాకపోతే ఇద్దరిదీ బ్రో,సిస్టర్ రిలేషన్.
కాబట్టి ఆ హీరో కూడా పైకి ఏమీ అనలేక, అవస్థలు పడుతున్నాడని టాక్.ఒక రకంగా చెప్పాలంటే ఆ లేడీ మేనేజర్ వల్ల ఆ హీరో నరకం చూస్తున్నాడట.