యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట రోడ్డు వెడల్పు పనులు త్వరగా పూర్తి కాకపోవడం వలన రాత్రి సమయంలో వాహనాలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,దీని వలన ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే రోడ్డు పనులు పూర్తి చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సిపిఐ యాదాద్రి జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు.మంగళవారం స్థానిక రహదారి బంగ్లాలో సిపిఐ మండల కౌన్సిల్ సమావేశానికి ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ రామన్నపేట పాత నియోజకవర్గాన్ని తిరిగి నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని, ధర్మారెడ్డి ఫిలాయిపెల్లి కాలువలను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని,
అదేవిధంగా రామన్నపేట ఏరియా హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా మార్చి అభివృద్ధి చేయాలని,రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని, కొద్దిమందికే తప్ప అనేకమందికి ఉచిత కరెంట్,గ్యాస్ సబ్సిడీ రాలేదని వెంటనే వచ్చే విధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు.
పట్టణ కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ బాగా లేక ప్రజల రోగాల బారీన పడే అవకాశాలు ఉన్నాయని,సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తగిన చర్య చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ, సీనియర్ నాయకులు బాలగొని మల్లయ్య, ఉట్కూరి భగవంతు, గంగాపురం వెంకటయ్య, రచ్చ యాదగిరి,ఉట్కూరి కృష్ణ,కళ్లెం యాదగిరి, జగన్నాథం,కళ్లెం రామచంద్రు,కాడయ్య.
చారి,గాలయ్య, తదితరులు పాల్గొన్నారు.