తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సినీ వారసులు హీరోలుగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే .ఇలా ఇండస్ట్రీలో వారసులుగా కొనసాగుతున్న వారిలో మహేష్ బాబు ఒకరు.
సూపర్ స్టార్ కృష్ణ ( Krishna ) వారసుడిగా మహేష్ బాబు బాల నటుడు గాని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇక త్వరలోనే మహేష్ బాబు ( Mahesh Babu ) వారసులుగా గౌతమ్, సితార కూడా ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇక మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ( Gautham ) ఇదివరకే మహేష్ నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో నటించి మెప్పించారు.ఈ సినిమా తర్వాత ఈయన చదువుపై దృష్టి పెట్టారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సును ఈయన విదేశాలలో చదువుతున్నారని తెలుస్తోంది.అయితే త్వరలోనే గౌతమ్ ఘట్టమనేని హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అనే వార్త తాజాగా చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే గౌతమ్ ను ఇండస్ట్రీకి లాంచ్ చేయబోయే డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యారని సమాచారం మరియు ఇండస్ట్రీకి లాంచ్ చేయబోయే డైరెక్టర్ ఎవరు? ఆ సినిమా విశేషాలు ఏంటి అనే విషయానికి వస్తే.మహేష్ బాబు కృష్ణ వంశీ ( Krishna Vamsi ) డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మురారి ( Murari ) ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది .తాజాగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని తిరిగి విడుదల చేయగా ఎంతో అద్భుతమైన ఆదరణ వచ్చింది దీంతో డైరెక్టర్ కృష్ణవంశీ మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా రిపోర్టర్స్ అని ప్రశ్నిస్తూ మీరు గౌతమ్ ను మురారి సీక్వెల్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ.ఈ విషయం చెప్పాల్సింది నువ్వు నేను కాదు.
మహేష్ బాబు నమ్రత చెప్పాల్సి ఉంటుంది వారికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను గౌతమ్ తో సినిమా చేయడానికి సిద్ధమే అని తెలిపారు.ఈయన మాటలను బట్టి చూస్తే మురారి సీక్వెల్ సినిమాతో గౌతమ్ ను ఇండస్ట్రీకి లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.