దర్శక దిగ్గజం రాజమౌళి( Rajamouli ) గొప్ప డైరెక్టర్ మాత్రమే కాదు చాలా మంచి సినిమా క్రిటిక్ కూడా.ఆయనకు ఎక్కువగా ఫ్రీ టైం దొరకదు కానీ దొరికినప్పుడు మాత్రం ఆస్కార్ రేంజ్ సినిమాలను చూస్తారు.
అలాగే సెన్సేషనల్ హిట్ అయిన చిన్నపాటి తెలుగు సినిమాలను కూడా చూస్తారు.అంతేకాదు వాటికి నిష్పక్షపాతమైన రివ్యూలు ఇస్తుంటారు.
కొంతమందికి రాజమౌళి రివ్యూస్ నచ్చుతాయి.మరి కొంత మందికి నచ్చవు.
రాజమౌళి ఇతర డైరెక్టర్ల సినిమాల్లో కొన్ని సీన్లు నచ్చలేదని బహిరంగంగానే చెప్పారు.మరి ఆ సినిమాలేంటి, ఆయనకు నచ్చని సన్నివేశాలు ఏవో తెలుసుకుందాం.
• కలర్ ఫొటో క్లైమాక్స్
కరోనా సమయంలో విడుదలైన “కలర్ ఫొటో” సినిమా( Color Photo Movie ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.కొత్త దర్శకుడు సందీప్ రాజ్ ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.ఈ మూవీలో సుహాస్,( Suhas ) చాందిని చౌదరి( Chandini Chowdary ) హీరో హీరోయిన్లుగా నటించగా సునీల్ విలన్ గా యాక్ట్ చేశాడు.ఈ సినిమా చివరిలో హీరో చనిపోతాడు.
అయితే ఈ క్లైమాక్స్ అనేది రాజమౌళికి అసలు నచ్చలేదట.అంతేకాదు కలర్ ఫొటో డైరెక్టర్‌ను రాజమౌళి ఇంటికి పిలిపించుకున్నాడట.“సినిమా చావుతో మొదలైతే పర్లేదు కానీ చావుతో ఎండ్ కాకూడదు. చావు వల్ల ఒక అర్థం ఉండాలి.” అని మరీ మరీ చెప్పాడట.ఇలా ఫాలో అవుతేనే ప్రేక్షకులకు అసంతృప్తి లేకుండా సినిమాని పూర్తిగా చూసినట్లు ఉంటుందని సూచించాడట.సందీప్ రాజ్ నెక్స్ట్ సినిమాలో వాటిని రిపీట్ చేయనని మాట ఇచ్చాడట.
• కొండవీటి దొంగ
చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించిన కొండవీటి దొంగ( Kondaveeti Donga ) సినిమాలో గుర్రంతో ఒక సన్నివేశం ఉంటుంది.భూమిలోకి కూలిపోయిన చిరంజీవికి తాడు విసిరి గుర్రం అతడిని పైకి లాగుతుంది.ఆ తర్వాత అతను దానికి కొంచెం కూడా థాంక్స్ చెప్పకుండా అక్కడినుంచి వెళ్ళిపోతాడు.
అయితే రాజమౌళికి సన్నివేశం అసలు నచ్చలేదట.మన సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పినట్లు సినిమాలో చూపించాల్సిన అవసరం ఉందని ఆయన భావించాడు.
అందుకే మగధీర సినిమాలో ఈ సన్నివేశాన్ని మళ్లీ కరెక్ట్ గా చూపించి సంతృప్తిగా ఫీల్ అయ్యాడు.రాజమౌళి తన సినిమాలోని పర్ఫెక్షన్ కాదు ఇతర సినిమాల్లో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటారని ఈ రెండు సంఘటనలతో తెలిసింది.