నాగచైతన్య సమంత( Samantha ) విడిపోయిన తర్వాత ఇద్దరు కూడా వారి కెరియర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.అయితే నాగచైతన్య ( Nagachaitanya ) మాత్రం నటి శోభిత( Sobhita ) ప్రేమలో పడటం ఆమెను రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.
ఇప్పటికే నటి శోభితతో కలిసి ఈయన నిశ్చితార్థం( Engagment ) చేసుకున్నారు.ఇలా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో తిరిగి నాగచైతన్య శోభిత సమంతకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని చాలామంది భావిస్తున్నారు కానీ ఈమె తన మాజీ భర్త బాటలోనే రెండో పెళ్లి చేసుకుంటుందా లేకపోతే సింగిల్గానే లైఫ్ లీడ్ చేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక సమంత నటిగా కొనసాగుతూనే మరోవైపు ఎన్నో వ్యాపారాలను చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈమె సంపాదనలో కొంత భాగం ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలువురికి సహాయ సహకారాలు చేస్తున్నారు.అలాగే అనాధ పిల్లల కోసం ఎన్నో ట్రస్టులకు ఈమె విరాళాలు కూడా అందజేస్తున్నారు.
ఈ విధంగా సమంత ఈమె సంపాదించిన దానిలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్న సంగతి తెలిసింది.అయితే తాజాగా ఈమె తన ఆస్తుల విషయంలో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.సమంత హీరోయిన్గా కొనసాగుతూ సుమారు 150 కోట్ల వరకు ఆస్తులను సంపాదించినట్టు సమాచారం అయితే ఇందులో 60% తన ఆస్తులను అనాధ పిల్లల కోసం రాసి ఇచ్చేలాగా పలువురు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారట.ఇలా తన ఆస్తిలో 60% అనాధ పిల్లలకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.