మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదల( Niharika Konidala ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా నిహారిక కొణిదల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్( Pink Elephant Pictures ) ఎల్.
ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై వచ్చిన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’.ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు 9 న రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసింది.ఈ ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా డిఫరెంట్ కంటెంట్ తో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లో మరోవైపు యూతును కూడా బాగా ఆకట్టుకుంది.
అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుందనే చెప్పాలి.అంతేకాకుండా.‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా( ‘Committee Kurrollu’ movie ) సినీ సెలబ్రెటీల ప్రసంసల మంచి స్పందన కూడా పొందుతుంది.
ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) కమిటీ కుర్రోళ్ళు సినిమా యూనిట్ ను సోషల్ మీడియా ద్వారా అభినందించారు.‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు సంబంధించి మంచి విషయాలను విన్నాను.తొలి చిత్రంతో నిర్మాతగా సక్సెస్ సాధించిన నిహారిక కొణిదెలకు అభినందనలు.
సినిమాలో సక్సెస్‌లో భాగమైన చిత్ర యూనిట్‌కు అభినందనలు.సినిమాను త్వరలోనే చూస్తాను’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు మహేష్ బాబు.
ఇక ఈ ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.విడుదలైన ప్రతిచోటా ఈ సినిమాకు మంచి రెస్పాస్స్ వచ్చింది.
కమిటీ కుర్రోళ్లు చిత్రానికి యదు వంశీ ( Yadu Vamsi )దర్శకత్వం వచించారు.ఈ చిత్రంతో దాదాపు 16 మంది నూతన నటీనటులు పరిచయం కాగా.గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథకు సినీ ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.దింతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి.ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిన్న సినిమా మొదటి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది.వారాంతరం ముగియడడంతో మంథితా భారీ కలెక్షన్స్ ను అందుకోనుంది.