బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు ( Guppedantha Manasu ) సీరియల్ ఒకటి.ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతు ఇప్పటికే సుమారు 1100 కు పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.
ఇక ఈ సీరియల్ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ఈ సీరియల్ లో రిషిధార జంటకు విపరీతమైన క్రేజ్ ఉంది.
ఈ సీరియల్ నుంచి కొద్ది రోజులపాటు రిషి ( Rishi ) తప్పుకోవడంతో ఈ సీరియల్ రేటింగ్ పూర్తిగా పడిపోయింది.దీంతో తప్పనిసరి పరిస్థితులలో నిర్మాతలు తిరిగి రిషిను సీరియల్ లోకి తీసుకువచ్చారు.
ఇలా రిషి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీరియల్ రేటింగ్ కూడా ఆ మాత్రం పెరిగిపోయింది.అయితే ఈ సీరియల్ ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మేకర్స్ ఒక వారం వ్యవధిలోనే ఈ సీరియల్ కి ముగింపు పలకబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఈ సీరియల్ మరొక వారం రోజులలో శుభం కార్డు పడబోతుంది అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.ఇంత అర్జెంటుగా ఈ సీరియల్ క్లోజ్ చేయడానికి కారణం బిగ్ బాస్( Bigg Boss ) అని తెలుస్తోంది.
బిగ్ బాస్ కార్యక్రమం త్వరలోనే ఇటు తెలుగులోనూ అటు కన్నడ భాషలో కూడా ప్రసారం కాబోతోంది తెలుగులో ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాక కన్నడలో 11వ సీజన్ ప్రారంభం కాబోతోంది.ఈ క్రమంలోనే ఈ సీరియల్ హీరో రిషి అలియాస్ ముఖేష్ గౌడ్ కన్నడ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం అదేవిధంగా వసుధార కూడా తెలుగు బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.నిజంగానే వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో కనుక పాల్గొంటే తప్పకుండా విజేతలుగా వీరే తిరిగి వస్తారని తెలుస్తుంది.ఇక తెలుగులో రక్షగౌడ్ ( Raksha Gaud ) బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటే ఈమె విజేతగా నిలుస్తారు.
తెలుగులో రక్షా గౌడ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది.మరి వీరి గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.