వావ్ . . ఈ పంతులమ్మ పిల్లలకు పాఠాలు ఎంత బాగా చెబుతోందో.. (వీడియో)

ప్రస్తుత రోజుల పిల్లల టాలెంట్( Children’s talent ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందుకు తగ్గట్టే పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్స్ కూడా అలానే ఉండాలి.

 How Well This Panthulamma Is Teaching Children, Teacher Talent, Viral Video, Vir-TeluguStop.com

వారికి బోధించే సమయంలో అనేక ప్రయత్నాలు, వివిధ రకాల పిల్లలకు వివరించే విధానం చేస్తున్నారు కొందరు.ఈ క్రమంలో తాజాగా బీహార్( Bihar ) కు చెందిన ఒక టీచర్ పిల్లలకు బోధిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఆ టీచర్ స్కూల్లో పాఠాలు చెప్పే విధానం నిజంగా అద్భుతమని చెప్పాలి.ఆ టీచర్ పిల్లలకు బోధించే తీరుకు పిల్లలు కూడా బాగా ఆకర్షితులవుతున్నారు.

ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్ లోని బంకా జిల్లాకు చెందిన ఖుష్బూ కుమారి( Khushboo Kumari ) అనే ఉపాధ్యాయురాలు కాథోన్ ( Cathon )అనే ఈ మిడిల్ స్కూల్‌ లో గణితం తోపాటు మిగితా సబ్జెక్టులు సరదాగా పిల్లలకు బోధిస్తుంది.ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వైరల్ అవుతున్న వీడియోలో.

, ఉపాధ్యాయురాలు ఖుష్బూ ఆనంద్ తన చేతి సంజ్ఞలతో పాఠశాల విద్యార్థులకు హిందీ ఒత్తులను చాలా బాగా చాకచక్యంగా వివరిస్తోంది.ఈ హిందీ ఒత్తులను పిల్లలకు వివరించే విధానం నిజంగా అద్భుతం.

సోషల్ మీడియా లో వీడియోను షేర్ చేస్తూ , ‘పిల్లల పరిమాణం, అవగాహన మంచి మార్గంలో అభివృద్ధి చెందాలంటే.కొన్నిసార్లు మనం కూడా పిల్లలుగా మారాలి.పిల్లలుగా మారి, పిల్లలకు నేర్పించాలి.ఈ బోధన అభ్యాస ప్రక్రియలో సహాయం చేయడం చాలా గొప్పది.ఆనందాన్ని ఇస్తుంది” అంటూ రాసుకొచ్చింది.ఈ టీచర్ బోధించే పద్ధతి నెటిజన్స్ తో పాటు పిల్లల్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ వీడియోకు ఒక వ్యక్తి ‘విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో, ఆసక్తికరంగా చేయడంలో మీరు ఎంతో విజయం సాధించారు’ అంటూ కామెంట్ చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube