సాధారణంగా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ( Independence Day, Republic Day )ఇలా వస్తున్నాయి అంటే ప్రభుత్వ కార్యాలయాలలో, స్కూళ్లలో, కాలేజీలలో సెలబ్రేషన్స్ మొదలవుతూ ఉంటాయి.అయితే తాజాగా ‘హర్ ఘర్ తిరంగ’( Har Ghar Thiranga ) అనే కార్యక్రమం ఆగస్టు 9న మొదలైన సంగతి అందరికీ తెలిసినదే.ఈ కార్యక్రమం ఆగస్టు 15 న ముగింపు పలకనుంది.2022 సంవత్సరంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ ‘హర్ ఘర్ తిరంగ’ అనే కార్యక్రమం మొదలు పెట్టారు.అంతే కాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా.‘తిరంగా బైక్ ర్యాలీ’ కూడా ఆగస్టు 13న జరగబోతుంది.ఇక ఈ ర్యాలీలో పార్లమెంటు సభ్యులు అందరూ కూడా పాల్గొనబోతున్నారు.అలాగే ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం నుండి మొదలై మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం( Major Dhyan Chand Stadium ) వద్ద ముగిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ ‘తిరంగా బైక్ ర్యాలీ’ ఇండియా గేట్ మార్గం గుండా జరగనుంది.
ఇక మరోవైపు ప్రధాన మోడీ ఈ ప్రచారంలో చురుగ్గా పాల్గొనే లాగా ప్రోత్సహిస్తున్నారు.ఆగస్టు 9న ‘హర్ ఘర్ తిరంగ’ను ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా మార్చాలని దేశ ప్రజలను కోరుతూ X లో పోస్ట్ కూడా చేయడం మనం చూసాము.త్రివర్ణ పతాకంతో ప్రొఫైల్ చిత్రాలను అప్డేట్ చేయాలని, ప్రచారానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ harghartiranga.comలో సెల్ఫీలను షేర్ చేసుకోవాలని కూడా మోడీ తెలిపారు.
మనం ” హర్ ఘర్ తిరంగ సర్టిఫికేట్ ” డౌన్లోడ్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
ముందుగా https://hargartiranga.com వెబ్‌సైట్ లోకి వెళ్ళాలి.అక్కడ ‘అప్‌లోడ్ సెల్ఫీ’ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.ఆపై ప్రక్రియను ప్రారంభించడానికి “పాల్గొనేందుకు క్లిక్ చేయండి”పై క్లిక్ చేయాలి.
అనంతరం మీ వివరాలను నమోదు చేయండి.మీ పేరు, ఫోన్ నంబర్, దేశం, రాష్ట్రాన్ని అక్కడ తెలపండి.
ఆపై మీ సెల్ఫీని అప్లోడ్ చేయాలి.పోర్టల్ లో నా చిత్రాన్ని ఉపయోగించడానికి నేను అధికారం ఇస్తున్నాను అనే ప్రతిజ్ఞను చదివి అంగీకరించండి.
ఆపై ‘సమర్పించు’ క్లిక్ చేయాలిసి ఉంటుంది.మీ సర్టిఫికేట్‌ను పొందడానికి “సర్టిఫికేట్‌ను రూపొందించండి” పై క్లిక్ చేస్తే సరి.మీ సర్టిఫికేట్‌ను సేవ్ చేయడానికి డౌన్‌లోడ్ బటన్‌ను ఉపయోగించండి.లేదా అందించిన ఎంపికలను ఉపయోగించి ఆన్‌లైన్‌లో భాగస్వామ్యం అవ్వచ్చు కూడా.