ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చైతన్య శోభిత జాతకం చెప్పడంపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.అక్కినేని ఫ్యాన్స్ వేణుస్వామిని( Venu Swamy ) టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
అయితే చైతన్య శోభిత జాతకం చెప్పడం వెనుక గల కారణాలను వేణుస్వామి వెల్లడించగా ఆ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.మూడు రోజుల క్రితం నేను చైతన్య శోభిత( Naga Chaitanya, Sobhita ) జాతకం చెప్పానని ఆయన తెలిపారు.
నేను చెప్పిన జాతకం గురించి ట్రోల్స్, డిబేట్స్ జరుగుతున్నాయని వేణుస్వామి పేర్కొన్నారు.గతంలో చైతన్య సమంత జాతకం చెప్పిన నేను ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ జాతకం చెప్పడం జరిగిందని వేణుస్వామి చెప్పుకొచ్చారు.
నేను ఏ మాట చెప్పానో ఆ మాటపై నిలబడటానికి సిద్ధమని ఆయన పేర్కొన్నారు.నేను ఇకపై రాజకీయ విశ్లేషణలు కూడా చేయనని వేణుస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(Vishnu Manchu ) నాతో మాట్లాడారని ఆయనకు నేను స్పష్టత ఇచ్చానని వేణుస్వామి చెప్పుకొచ్చారు.నేను ఇకపై ఎవరి జాతకం చెప్పను అని చెప్పానని ఆయన నాతో మాట్లాడారని వేణుస్వామి వెల్లడించారు.వేణుస్వామి చెప్పిన విషయాలు సోషల్ మీడియా( Social media ) వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.వేణుస్వామి అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వేణుస్వామి సెలబ్రిటీల అనుమతితో జాతకాలు చెబితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వేణుస్వామి క్రేజ్ కోసం సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.వేణుస్వామి మీద ఫిర్యాదులు సైతం అందుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం కొసమెరుపు.వేణుస్వామి గాసిప్స్ ను ప్రచారం చేస్తూ ఈ మధ్య కాలంలో నెట్టింట తెగ వార్తల్లో నిలుస్తున్నారని చెప్పవచ్చు.
వేణుస్వామిని అభిమానించే వాళ్ల సంఖ్య కంటే విమర్శించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.