టిప్‌లపై పన్నులు ఎత్తేస్తా.. కమలా హారిస్ సంచలన ప్రకటన, అది నా హామీ అంటూ ట్రంప్ ఫైర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris ) దూకుడు పెంచారు.తన రన్నింగ్‌మెట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి)గా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను ఎంపిక చేసుకున్న ఆమె ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

 Kamala Harris Copies Donald Trump's Promise On No Tax For Tips , Democratic Par-TeluguStop.com

డెమొక్రాటిక్ పార్టీ మొత్తం ఇప్పటికే కమలా వెంట నడుస్తుండగా.ఇతర వర్గాల మద్ధతును కూడగట్టేలా ఆమె వ్యూహాలు రచిస్తున్నారు.</br?

Telugu Democratic, Donald Trump, Joe Biden, Kamala Harris, Tax Tips, Presidentia

మరోవైపు. ముందస్తు సర్వేలు, ఓపీనియన్ పోల్స్‌లోనూ కమల హారిస్ ముందంజలో ఉన్నారు.న్యూయార్క్ టైమ్స్ సియానా కాలేజ్‌లు స్వింగ్ స్టేట్స్‌లో సంయుక్తంగా సర్వేని నిర్వహించాయి.ఇందులో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )కంటే కమల 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు.

స్వింగ్ స్టేట్స్‌గా పేర్కొనే విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగన్‌లలో ట్రంప్‌కు 46 శాతం మంది మద్దతు పలకగా. కమలా హారిస్‌కు 50 శాతం మంది జైకొట్టారు.మరోవైపు.విరాళాల విషయంలోనూ ట్రంప్‌తో పోలిస్తే కమల ముందంజలో ఉన్నారు.

అలాగే వీరిద్దరి మధ్య వచ్చే నెల 10న ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగనుంది.</br?

Telugu Democratic, Donald Trump, Joe Biden, Kamala Harris, Tax Tips, Presidentia

ఇదిలాఉండగా.ఆదివారం లాస్‌వేగాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నెవడాలో జరిగిన ర్యాలీలో కమలా హారిస్ పాల్గొని ప్రసంగించారు.హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద పరిశ్రమలపై అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఆధారపడి ఉందన్నారు.

ఈ క్రమంలో రెస్టారెంట్ల( Restaurants )లో పనిచేసే కార్మికులు సహా ఇతర సేవా రంగాల్లోని వారికి ఇచ్చే టిప్‌లపై పన్నును ఎత్తివేస్తామని ఆమె సంచలన ప్రకటన చేశారు.దేశంలోని కార్మిక కుటుంబాల తరపున పోరాడుతానని.

కనీస వేతనాలు పెరిగేలా కృషి చేస్తానని కమలా హారిస్ అన్నారు.ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే తాను అధికారంలోకి వస్తే సేవా రంగంలో టిప్‌లపై సుంకాలను ఎత్తివేస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు.దీంతో తన హామీని కాపీ కొట్టారంటూ ఆయన కమలా హారిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube