టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్( Hero Vishwak Sen ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే విశ్వక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.చేతినిండా బోలెడు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు విశ్వక్సేన్.
ఇక ప్రస్తుతం మెకానిక్ రాఖీ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
అయితే దాస్ కా దంమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ( Das Ka Damki, Gami, Gangs of Godavari )సినిమాల తరువాత విష్వక్ మీద మినిమమ్ బిజినెస్ అనేది ఏర్పడింది.దాంతో నిర్మాతలు లైన్ లోకి వచ్చారు.
మెకానిక్ రాఖీ తరువాత చేస్తున్న సినిమా లైలా( Laila ).ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలు సైన్ చేసాడు.జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ ( Directed Anudeep )తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేస్తున్నాడు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరక్టర్ కృష్ణ చైతన్య ( Director Krishna Chaitanya )దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.
నితిన్ తో చేయాలనుకుంటున్న పవర్ పేట సినిమాను విశ్వక్ తో చేస్తారు.అయితే ఇలా వరుస సినిమాలు చేతిలోకి రావడంతో విష్వక్ రెమ్యూనిరేషన్ ను పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ ను విష్వక్ 7 కోట్ల మేరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఓకె చెప్పిన సినిమాలు కాకుండా, అనుదీప్ సినిమా నుంచి ఈ కొత్త రేటు కోట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకుంటుండడంతో ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం ఓకే అంటున్నారట.అయితే ముందు ముందు తన రెమ్యూనరేషన్ ను మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.