సాధారణంగా పట్టణాలలో నివశించే వాళ్లతో పోల్చి చూస్తే గ్రామాలలో నివశించే వాళ్లకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.అయితే ఒక గ్రామం తలరాతను మార్చే సామర్థ్యం ఉన్నవాళ్లు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు.
జడ్జిగా ఎంపికై గ్రామ తలరాతను మార్చిన అభిలాష జెఫ్( Abhilasha jeph ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.రాజస్థాన్ లోని నయాబాస్( Nayabas ) గ్రామానికి చెందిన ఈ యువతి ఆ గ్రామ స్వరూపాన్నే మార్చేశారు.
ఒకప్పుడు ఆ గ్రామం పేరు వింటే దొంగతనాలు, దోపిడీలు, అక్రమ మద్యం గుర్తుకు వచ్చేవి.ఇప్పుడు మాత్రం ఆ గ్రామంలో చాలామంది పెద్ద ఉద్యోగాలు సాధిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.అభిలాష జెఫ్ జడ్జీ( Abhilasha jeph ) ఉద్యోగం సాధించిన తర్వాత గ్రామస్థులు ఆమె విజయాన్ని డీజే మోతలతో సెలబ్రేట్ చేసుకోవడం గమనార్హం.
అమ్మాయిల చదువుకు ఆ గ్రామం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం కొసమెరుపు.ఈ గ్రామంలో ఎన్ని కష్టాలు వచ్చినా తమ పిల్లలను మంచి చదువులు చదివిస్తామని ఎంతొమంది తల్లులు ప్రతిజ్ఞలు చేయడం గమనార్హం.ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా పంజాబ్ లో డీఐజీగా పని చేస్తున్నారు.
నయాబస్ ను కొంతమంది ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తున్నారు.ఈ గ్రామం నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గ్రామంతో మాత్రం టచ్ లో ఉంటున్నారు.
అమ్మాయిల చదువు విషయంలో ఈ గ్రామం చూపిస్తున్న చొరవ గురించి ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది.అభిలాష సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
అభిలాష జెఫ్ తన టాలెంట్ తో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.