పారిస్ ఒలింపిక్స్‌లో జువెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా( Neeraj Chopra )కు రజతం దక్కిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ స్వర్ణం అందుకున్నాడు.గురువారం జరిగిన ఫైనల్ ఈవెంట్లో నీరజ్ 89.45 మీటర్ల దూరం ఈటెను విసిరి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు.రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi) సహా పలువురు ప్రముఖులు అభినందించారు.

ఈ నేపథ్యంలో పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా కనుక స్వర్ణం సాధిస్తే భారతీయులకు ఉచిత వీసాలు అందిస్తానని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న వీసా సేవలు అందించే స్టార్టప్ అట్లీస్ సీఈవో మోహక్ నహతా( Mohak Nahta ) గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే నీరజ్.రజతం గెలుచుకున్నప్పటికీ తన హామీని నిలబెట్టుకుంటానిన ఆయన వెల్లడించారు.
ఈ మేరకు తన లింక్డ్ ఇన్‌లో పోస్టు పెట్టారు.పతకం రంగు ముఖ్యం కాదని మన స్పూర్తి మాత్రం ప్రకాశిస్తుందన్నారు.
దరఖాస్తుదారులు ఫ్రీ వీసా ఆఫర్‌ను ఎలా వినియోగించుకోవాలో Atlys నుంచి సూచనలు అందుకుంటారని మోహక్ పేర్కొన్నారు.

కాగా.కొద్దిరోజుల క్రితం మోహక్ నహతా లింక్డిన్లో సంచలన పోస్ట్ పెట్టారు.పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే .తన వినియోగదారులకు ఒక రోజు ఉచితంగా వీసాలు అందిస్తానని పోస్ట్ చేశారు.మరో పోస్ట్‌లో దీనిపై ఆయన క్లారిటీ సైతం ఇచ్చారు.
ఆగస్ట్ 8న జరగనున్న పోటీల్లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తే ఫ్రీగా వీసా ఇస్తామని వాగ్థానం చేశానని వెల్లడించారు.మీలో చాలా మంది నన్ను వివరాలు అడిగారు కాబట్టి.
అది ఎలా వర్కవుట్ అవుతుందో వివరిస్తానని మోహక్ పేర్కొన్నారు.అన్ని దేశాలకు వెళ్లే వ్యక్తులకు ఇది వర్తిస్తుందని.
ఇందుకోసం రుసుము కింద పైసా కూడా వసూలు చేయబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొందరు మోహక్ నహతాకు పలు సూచనలు కూడా చేస్తున్నారు.ఇక Atlys విషయానికి వస్తే.2020లో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో( San Francisco)లో ఈ కంపెనీని స్థాపించారు.భారత్ , అమెరికాలలో ఈ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి.
ఇండియాలో ముంబై, గురుగ్రామ్‌లని కేంద్రాలలో వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వినియోగదారులకు ఈ కంపెనీ సాయం చేస్తుంది.