ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్ మూవీస్ పాన్ ఇండియా వైడ్‌గా హిట్స్ అవుతున్నాయి.బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, రంగస్థలం, బింబిసార, హనుమాన్, విరూపాక్ష వంటి సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగా మెప్పించాయి.
కానీ ఈ తరహా ఇంట్రెస్టింగ్ స్టోరీలతో బాలీవుడ్ హీరోలు సినిమాలు చేయలేకపోతున్నారు.అందుకే నేటి ప్రేక్షకులను మెప్పించలేక డిజాస్టర్లు అందుకుంటున్నారు.
ఒకప్పుడు అక్షయ్ కుమార్ హిట్స్‌తో దూసుకెళ్లాడు కానీ ఇప్పుడు వరుసగా 13 డిజాస్టర్లను అందుకున్నాడు.అంటే అక్కడ పరిస్థితి ఎలా తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
అలానే ఒకప్పుడు చాలా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఒక్క హిట్ కొట్టలేక సతమతమవుతున్నారు.నిజం చెప్పాలంటే, గతంలో అక్షయ్ కుమార్‌కి ( Akshay Kumar )కొంతమంది డైరెక్టర్లు వరుసగా సూపర్ హిట్లను అందించగలిగారు కానీ ఇప్పుడు మాత్రం ఓ హీరోను నట్టేట ముంచేస్తున్నారు.
ముఖ్యంగా ఈ దర్శకుల వల్ల అజయ్ దేవగన్ అత్యంత చెత్త ప్లాపులను అందుకుంటున్నాడు.ఇటీవల అతను హీరోగా, టబు హీరోయిన్‌గా వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా “ఔరోన్ మే కహన్ దమ్ థా” ( Auron Mein Kahan Dum Tha )అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది.
ఇంతకుముందు అక్షయ్ కుమార్ తీసిన సెల్ఫీ, మిషన్ రాణిగంజ్ సినిమాల పేరిట ఉన్న చెత్త రికార్డును ఇది చెరిపేసింది అనే చెప్పాలి.
ఔరోన్ మే కహన్ దమ్ థా మూవీ తీసిన డైరెక్టర్ నీరజ్ పాండే.ఈ దర్శకుడు స్పెషల్ 26, బేబీ లాంటి సినిమాలతో అక్షయ్‌కు హిట్స్ ఇచ్చాడు.కానీ నీరజ్ పాండే అజయ్ ( Neeraj Pandey Ajay )తో కలిసి 100 కోట్లతో తీసిన “ఔరోన్ మే కహన్ దమ్ థా” సినిమా రూ.10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.ఇంతకంటే ఆ మూవీ ఎక్కువగా కలెక్ట్ చేయలేదని చెప్పవచ్చు.
డైరెక్టర్ ప్రియదర్శన్ ( Director Priyadarshan )అక్షయ్ కుమార్‌కి హేరా ఫెరీ, భూల్ భూలేయా వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాడు.ఇప్పుడు అదే డైరెక్టర్ అజయ్ దేవగన్‌కు ఆక్రోష్ రూపంలో బిగ్గెస్ట్ ఫ్లాప్ అందించాడు.మరో డైరెక్టర్ సాజిద్ ఖాన్( Director Sajid Khan ) అక్షయ్‌కు హౌస్ ఫుల్ సిరీస్ తో హిట్స్ ఆఫర్ చేశాడు.అయితే అజయ్ దేవగన్ ఖాతాలో మాత్రం హిమ్మత్ వాలా మూవీతో ఒక డిజాస్టర్ వేశాడు.
ప్రభుదేవా అక్షయ్ కలిసి రౌడీ రాథోడ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.అదే ప్రభుదేవా యాక్షన్ జాక్సన్ సినిమాతో కనీ వినీ ఎరుగని ఫ్లాప్ ఇచ్చాడు.విధంగా ఒక హీరోకి హిట్స్ మరొక హీరోకి అన్నీ ఫ్లాప్స్ ఇచ్చి ఈ దర్శకులు షాకిచ్చారు.