ఒలింపిక్స్‌లో విచిత్రంగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఆస్ట్రేలియన్.. వీడియో వైరల్..

ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో( Paris Olympics ) బ్రేక్‌డ్యాన్స్‌ను కొత్తగా చేర్చారు.ఈ క్రీడ కోసం 17 మంది బాలికలు, 16 మంది అబ్బాయిలు ఫ్రాన్స్‌కు వెళ్లారు.

 Australian Dancer Put A Unique Spin On Breakdancing At The Paris Olympics 2024 D-TeluguStop.com

వీరందరూ బంగారం గెలవాలని కోరుకుంటున్నారు.పోటీల్లో చాలామంది అద్భుతంగా డాన్స్ చేశారు.

కానీ, ఆస్ట్రేలియన్‌ డాన్సర్ చేసిన స్టెప్పులు మాత్రం చాలా ఫన్నీగా కనిపించాయి.ఏదో కుక్క నేలపై బోర్లినట్టు, పాము లాగా డ్యాన్స్ వేసింది.

సోషల్ మీడియాలో ఆమె డ్యాన్సింగ్ వీడియో వైరల్ గా మారింది.దాన్ని చూసి చాలామంది ఎగతాళి చేస్తున్నారు.

ఆ ఆస్ట్రేలియన్‌ డ్యాన్సర్ పేరు రచెల్ గన్ (36 ఏళ్లు).( Rachael Gunn ) ఈ ఆర్టిస్ట్ ఒక బ్రేక్‌డాన్స్ పోటీలో పాల్గొంది.ఆమె ఆస్ట్రేలియా( Australia ) జెండా రంగుల్లో ఉన్న ట్రాక్‌సూట్ ధరించింది.కానీ, ఆమె ధరించిన దుస్తుల కంటే ఆమె చేసిన డ్యాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆమె చేసిన డ్యాన్స్‌( Dance ) కంగారు గంతులు వేసినట్లుగా ఉంది.నేలపై హాయిగా పొర్లుతూ, జంపులు చేస్తూ ఏవేవో విచిత్రమైన కదలికలు చేస్తూ ఆమె కనిపించింది.

సోషల్ మీడియాలో ఆమెను చాలా మంది నాట్యాన్ని చూసి నవ్వుకున్నారు.ఒలింపిక్స్‌ ఇప్పుడు వరల్డ్ వైడ్ కామెడీ షో గా మారిపోయింది అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

నిజానికి ఆమె చేసిన డ్యాన్స్ వెరైటీ గానే ఉంది.ఆ వైరల్ వీడియోను( Viral Video ) మీరు కూడా చూడవచ్చు.

ఇలాంటి మామూలు డ్యాన్స్ చేసి గోల్డ్ మెడల్ సాధించాలని ఆమె ఎలా అనుకుందో ఆమెకే తెలియాలి.

బ్రేక్‌డాన్స్( Breakdance ) అనేది ఒక రకమైన డాన్స్.ఇందులో నృత్యం చేయడంతో పాటు అథ్లెటిక్స్ మూవ్స్ కూడా చేస్తారు.ఈ డాన్స్ ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి దీన్ని ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చారు.2018లో బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో బ్రేక్‌డాన్స్‌ను మొదటిసారిగా చేర్చారు.ఇక 2024లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో కూడా బ్రేక్‌డాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube