కోచింగ్ లేకుండానే ఆరు ఉద్యోగాలు సాధించిన కానిస్టేబుల్ కూతురు.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

కోచింగ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.అయితే ఒక యువతి మాత్రం కోచింగ్ లేకుండానే ఆరు ఉద్యోగాలు సాధించి వార్తల్లో నిలిచారు.

 Kavitha Inspirational Success Story Details Inside Goes Viral In Social Media ,-TeluguStop.com

ప్రస్తుతం కేతావత్ నిఖిత సక్సెస్ స్టోరీ తెగ వైరల్ అవుతోంది.తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా ( Adilabad )నేరడిగొండ మండలం చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన ఈ యువతి తన సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.

నిఖిత తండ్రి పేరు సర్దార్ సింగ్ కాగా ఆమె తండ్రి ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు.కేతావత్ నిఖిత ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గురించి ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పవచ్చు.మంచిర్యాలలోని ప్రైవేట్ స్కూల్ లో నిఖిత( kethavath nikitha ) చదువుకున్నారు.ఆ తర్వాత మెదక్ లోని మోడల్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేశారు.

ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University ) నుంచి బీఈడీ పూర్తి చేశారు.

ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిఖిత బీఈడీ పూర్తి చేశారు.ఆ తర్వాత అదే యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లో పీజీ పూర్తి చేశారు.2023లో చదువు పూర్తి చేసిన నిఖిత ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం మొదలుపెట్టి తన లక్ష్యాలను సాధించారు.జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికైన నిఖిత ఆ తర్వాత గ్రూప్ 4 ఉద్యోగానికి కూడా ఎంపిక కావడం జరిగింది.ఆ తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ గా, పీజీటీ టీచర్ గా, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పని చేశారు.

కేవలం 12 నెలల కాలంలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.ప్రస్తుతం నిఖిత సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజ్ లో డిగ్రీ లెక్చరర్ గా పని చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube