వైసిపి అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) వైకిరేమిటో ఆ పార్టీ నేతలకు అంతుపట్టడం లేదు.ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు కేవలం 11 స్థానాలకే వైసిపి పరిమితం కావడంతో, పార్టీకి చెందిన కీలక నేతలు చాలామంది ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు.
జగన్ కి అత్యంత సహితులుగా పేరుపొందిన వారు పార్టీని వీడ్ యుగుట్ car వెళ్ళిపోతున్న జగన్ మాత్రం పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.అసలు ఎన్నికల్లో ఓటమి తరువాత నుంచి జగన్ పెద్దగా జనాల్లోకి రావడం లేదు.
పూర్తిగా బెంగళూరుకే పరిమితం అయిపోయారు .తాడేపల్లి ప్యాలస్ కి రావడం లేదు.ఏపీలో ఎన్నికలు ఫలితాలు వెలువడి రెండు నెలలైనా , ఇంకా పార్టీ నేతలతో పూర్తిస్థాయిలో సమావేశం పెట్టలేదు.వారితో మాట్లాడి నియోజకవర్గాలు, జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది , ఓటమికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి ? మళ్లీ పార్టీ బలం పుంజుకోవాలి అంటే ఏం చేయాలి అనే విషయాల పైన సమీక్ష నిర్వహించాల్సి ఉన్నా.జగన్ మాత్రం ప్రస్తుతం వాటిని పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత జగన్ బెంగళూరుకు మకాం మార్చారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావడం లేదు.దీంతో జగన్ పై సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
అసలు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని వదిలి బెంగళూరుకు వెళ్లాల్సిన పని ఏమిటని , ప్రస్తుతం పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో నాయకులకు అందుబాటులోకి లేకుండా దూరంగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు అనేక కారణాలతో రాజీనామాలు చేశారు.
గుంటూరు జిల్లా నుంచి మద్దాలి గిరి, కిలారు రోశయ్య, దొరబాబు, మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని( Alla Nani ) తో పాటు , మరి కొంతమంది పార్టీకి రాజీనామా చేయగా, మరి ఎంతోమంది రాజీనామా చేసే ఆలోచనతో ఉన్నారు.కీలకమైన నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ కేడర్ కూడా అయోమయంలో ఉంది.

దీంతో వారు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.2014లో వైసిపి ఓటమి చెందిన జగన్ ఎక్కడా నిరుత్సాహ పడకుండా పూర్తిగా జనాల్లోనే ఉన్నారు .పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. కానీ ఎప్పుడు జగన్ వైఖరి అందుకు భిన్నంగా ఉండడం పార్టీ కేడర్ కు అంత పట్టడం లేదు.