ఇదెక్కడి రోగం... మొబైల్‌లో అరగంటకన్నా ఎక్కువ మాట్లాడితే హై బీపీ వచ్చేస్తోంది?

మొబైల్ ఫోన్‌లో( Mobile Phone ) ఎవరెంత సేపు మాట్లాడుతున్నారో ఇక్కడ డిస్కస్ చేయడం అనవసరం.ఎందుకంటే ఇక్కడ దాదాపుగా అందరూ ఒకే బాపతు.

 Chances Of Getting High Bp If You Talk More Than 30 Minutes On Phone Details, Ne-TeluguStop.com

అయితే ఈ నేథ్యంలోనే అందరూ ఒక్క విషయం గుర్తెరగాలి.మీ ముచ్చ‌ట్లు వారానికి 30 నిమిషాలు గాని దాటితే మీరు హైబీపీ( High BP ) రిస్క్‌లో ఉన్న‌ట్లే.

అవును, మీరు టెన్షన్ పడినా ఇదే వాస్తవం.వారానికి 30 నిమిషాలు మొబైల్‌లో మాట్లాడిన వారిలో.

12 శాతం హై బీపీ వ‌చ్చే ఛాన్సు ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.మొబైల్ ఫోన్ల ద్వారా త‌క్కువ స్థాయిలో రేడియోఫ్రీక్వెన్సీ ఎన‌ర్జీ రిలీజ‌వుతుంద‌ని, ఆ ఎన‌ర్జీ వ‌ల్ల బ్ల‌డ్ ప్రెజ‌ర్ పెరుగుతుంద‌ని స్ట‌డీలో తేల్చి చెప్పారు.

Telugu China, Bp, Phone, Radiofrequency-Latest News - Telugu

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా గుండెపోటు మ‌ర‌ణాల‌కు హైప‌ర్‌టెన్ష‌న్ ( Hypertension ) ముఖ్య కార‌ణ‌మ‌న్న విష‌యం మనందరికీ తెలిసిందే.చైనాలోని గాంగ్జూలో ఉన్న స‌ద‌ర‌న్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ గ్జియాన్‌వూ క్విన్ ఈ అంశంపై రిపోర్టును తయారు చేయడం జరిగింది.మొబైల్ ఫోన్ ఎంత సేపు మాట్లాడార‌న్న అంశంపై గుండె ఆరోగ్య స్థితి ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అంటున్నారు.ఎక్కువ సేపు మొబైల్‌లో మాట్లాడేవారికి రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని ర‌చ‌యిత క్విన్ తెలిపారు.

యురోపియ‌న్ హార్ట్ జ‌న‌ర‌ల్ .డిజిట‌ల్ హెల్త్‌లో ఈ రిపోర్టును ప‌బ్లిష్ చేశారు.

Telugu China, Bp, Phone, Radiofrequency-Latest News - Telugu

యూకే బ‌యోబ్యాంక్ ఆ డేటాను సేక‌రించింది.37 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మ‌ధ్య ఉన్న సుమారు 2,12,046 మందిపై స్ట‌డీ చేయగా భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి.మొబైల్ ఫోన్‌లో వారానికి 30 నిమిషాల క‌న్నా ఎక్కువ మాట్లాడేవారిలో 12 శాతం అధికంగా హైబీపీ వచ్చినట్టు నిర్ధారణ అయింది.మ‌హిళ‌లైనా పురుషులైనా ఇలాంటి ప్ర‌మాదం ఒకే రీతిలో ఉంటుంద‌ని స‌ర్వేలో తేల్చారు.

వారంలో గంటలోపు మాట్లాడేవారికి 8 శాతం, 3 గంట‌ల పాటు ఫోన్లో మాట్లాడేవారికి 13 శాతం, 6 గంట‌లు మాట్లాడేవాళ్ల‌కు 16 శాతం, 6 క‌న్నా ఎక్కువ గంట‌లు మాట్లాడేవారికి 25 శాతం హైబీపీ వ‌చ్చే ఛాన్సు ఉందని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube