న్యూయార్క్: ఏందిది, డబుల్ రొట్టెను నెత్తిపై టోపీలాగా తొడుక్కున్నాడు.. వీడియో చూస్తే..

రీసెంట్ గా న్యూయార్క్ సబ్వేలో( New York Subway ) ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది.ఈ మార్గంలోని ట్రైన్ లో ఒకాయన డబుల్ రొట్టె ముక్కను( Double Bread ) తలపై టోపీలాగా పెట్టుకుని ప్రయాణించాడు.

 Man Spotted Wearing Bread Bun As Hat In New York Subway Video Viral Details, Vir-TeluguStop.com

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తోటి ప్రయాణికుడు తీసిన ఈ వీడియోలో ఆయన తలకు టోపీ లేదా విగ్‌కు బదులు రొట్టె ముక్కను పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.

ఆయన ఈ విచిత్రమైన టోపీతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ వీడియో ఆగస్టు నెలలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

లెక్సింగ్టన్ అవెన్యూ లైన్‌లో( Lexington Avenue Line ) ప్రయాణిస్తున్న వాళ్ళు ఒక వింత దృశ్యాన్ని చూశారు.ఒక మిడిల్ ఏజ్డ్‌ మ్యాన్ తలపై బన్ ముక్కను( Bun ) పెట్టుకుని ప్రయాణిస్తున్నాడు.ఆయన అది టోపీనా, లేక ఆహారమా అన్నది కూడా పట్టించుకోకుండా చాలా సరదాగా మెట్రోలో( Metro ) ప్రయాణిస్తున్నాడు.ఆయన తెల్లటి టీషర్టు వేసుకుని, ఒక చిన్న బ్యాగ్ తీసుకుని ప్రయాణిస్తున్నాడు.

కానీ ఆయన తలపై పెట్టుకున్న రొట్టె ముక్కే అందరి దృష్టిని ఆకర్షించింది.

మెట్రోలో ఇలాంటి విచిత్ర పనులు చేయడం కొత్తేమీ కాదు అని చాలామందికి తెలుసు.కానీ ఈసారి ఒకాయన తలపై రొట్టె ముక్కను పెట్టుకున్నాడు కాబట్టి అందరూ ఆశ్చర్యపోయారు.ఈ వింత దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ “కొంతమంది మెట్రో కోసం పుట్టి ఉంటారు, ఈయన రొట్టె కోసం పుట్టి ఉంటాడు” అని హిలేరియస్ కామెంట్ చేశాడు.న్యూయార్క్ మెట్రో ఎప్పుడూ ఇలాంటి విచిత్ర సంఘటనలకు ప్రసిద్ధి అని మరి కొంతమంది అన్నారు.

ఈ వీడియోను ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా చూశారు.దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube