ఈ హెర్బల్ టీ తాగితే జలుబు రెండు రోజుల్లో పరారవుతుంది!

ప్రస్తుత వర్షాకాలంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందర్నీ అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో జలుబు( Cold ) ముందు వరుసలో ఉంటుంది.జలుబు చిన్నదే అయినా తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.

 If You Drink This Herbal Tea The Cold Will Go Away In Two Days Details, Herbal-TeluguStop.com

పనిపై ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.అయితే సీజనల్ జలుబును రెండు రోజుల్లో తరిమి కొట్టడానికి పవర్ ఫుల్ హెర్బల్ టీ( Herbal Tea ) ఒకటి ఉంది.

ఆ టీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.

తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో దాల్చిన చెక్క,( Cinnamon ) లవంగాలు( Cloves ) మరియు యాలకులు( Cardamom ) సమపాలంలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.

ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

అలాగే అర టీ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి.మరియు ఐదు ఫ్రెష్ తులసి ఆకులు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

బాగా మరిగిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో మన హెర్బల్ టీను ఫిల్ట‌ర్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

Telugu Cardamom, Cinnamon, Tea, Tips, Herbal Tea, Herbaltea, Latest, Tulsi-Telug

మీరు ఈ హెర్బల్ టీ లో తేనెను( Honey ) కూడా జోడించవచ్చు.ప్రస్తుత వర్షాకాలంలో ఈ హెర్బల్ టీ ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.

ప్రధానంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సీజనల్ సమస్యలను చాలా వేగంగా పరిష్కరిస్తుంది.ఈ హెర్బల్ టీ తాగితే జలుబు రెండు రోజుల్లోనే పరారవుతుంది.

Telugu Cardamom, Cinnamon, Tea, Tips, Herbal Tea, Herbaltea, Latest, Tulsi-Telug

అంతేకాదు దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, తులసిలో ఉండే పోషకాలు మరియు శక్తివంతమైన ఔషధ గుణాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి అవసరమయ్యే సామర్థ్యాన్ని చేకూరుస్తాయి.అదే సమయంలో శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తాయి.బాడీని డీటాక్స్ చేస్తాయి.ఒత్తిడిని చిత్తు చేసి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.పైగా హెల్తీ వెయిట్ ను ప్రమోట్ చేయడంలోనూ ఈ హెర్బ‌ల్ టీ ఎంతో అద్భుతంగా స‌హాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube