అమెరికా : డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి టిమ్ వాల్జ్ సంపద ఎంతంటే..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ( Kamala Harris )ఖరారైన సంగతి తెలిసిందే.తన రన్నింగ్‌మెట్‌గా (ఉపాధ్యక్ష అభ్యర్ధి) మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను( Minnesota Governor Tim Walz ) కమల ఎంపిక చేశారు.

 Democratic Party Vice Presidential Candidate Tim Walz's Net Worth Below An Ameri-TeluguStop.com

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరిద్దరూ సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్నారు.ఈ నేపథ్యంలో వాల్జ్ వ్యక్తిగత వివరాలు, రాజకీయ నేపథ్యం తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

Telugu American, Calinia, Gwen, Kamala Harris, Tim Walz-Telugu Top Posts

టిమ్ వాల్జ్ అతని సహచరులలో అత్యంత పేదవాడు.ఆయన నికర ఆస్తుల విలువ అమెరికన్ రిపోర్ట్స్ ది ఫార్చ్యూన్( American reports The Fortune ) కంటే తక్కువగా ఉంది.ఆయనకు స్టాక్స్, బాండ్స్, ఆస్తి లేవని ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి.వాల్జ్ కానీ అతని భార్య గ్వెన్ ( Gwen )కానీ ఎలాంటి పెట్టుబడులను కలిగి లేరన్నది కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

వాల్ స్ట్రీట్ జర్నల్.టిమ్ వాల్జ్ , అతని భార్య గ్వెన్‌లు 2019లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం దాదాపు 3,30,000 విలువైన ఆస్తులను కలిగి ఉన్నారట.

వాల్జ్ దంపతులు ఎలాంటి స్టాక్‌లు, ఇటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, క్రిప్టో కరెన్సీలు, ఆర్‌ఈఐటీలు లేదా వ్యక్తిగత రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టలేదట.గవర్నర్ అధికారిక నివాసంలోకి మారే ముందు వీరు తమ ఇంటిని విక్రయించారు.

అధిక గృహాల ధరలు, పెరుగుతున్న తనఖా రేట్ల కారణంగా ప్రస్తుతం సగటు అమెరికన్ సొంతింటి కలిగి ఉండటం కష్టం.అమెరికాలో పదవీ విరమణ వయస్సుకు సమీపంలో ఉన్న వారికి నిర్దేశించే ఆర్ధిక ప్రమాణం కంటే వాల్జ్ ఆస్తులు తక్కువగా ఉన్నాయి.ఆ దేశంలో 60 ఏళ్ల లోపు వ్యక్తులు సాధారణంగా 1.65 మిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉంటారు.వారిలో సగం మంది సగటు నికర విలువ 4,46,703 మిలియన్ డాలర్లు.

Telugu American, Calinia, Gwen, Kamala Harris, Tim Walz-Telugu Top Posts

ఇకపోతే.కమలా హారిస్ 8 మిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నారని అంచనా.ఆమె భర్త కాలిఫోర్నియా వినోద పరిశ్రమలో విజయవంతమైన న్యాయవాది.అటు ఫోర్బ్స్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ సంపద విలువ 5.7 బిలియన్ డాలర్లుగా అంచనా.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 500వ స్థానంలో ట్రంప్ నిలిచారు.రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి , ఒహియో సెనేటర్ జేడీ వాన్స్ తన తాజా సెనేట్ ఫైలింగ్‌లో తన సంపదను 4.3 మిలియన్లు.10.7 మిలియన్ డాలర్లుగా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube