వీడియో వైరల్: వారితో కలిసి నృత్యం చేసిన సీఎం చంద్రబాబు..

2024 లో జరిగిన ఎన్నికలలో కనివిని ఎరగని మెజారిటీతో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మరోసారి టీడీపీ( TDP ) పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టగా.

 Video Viral: Cm Chandrababu Danced With Them , Tdp, Viral Video, Pawan Kalyan, A-TeluguStop.com

కూటమి ప్రభుత్వం విజయానికి మూలా స్థంగా నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.ఇకపోతే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) ఆదివాసీ మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు.

అంతేకాకుండా.ఆయన డప్పు వాయించారు కూడా.ఇక గిరిజన సంప్రదాయంలో భాగమైన కొమ్మకోయను దరించారు.ఇంకా అక్కడ ఉన్న ఆదివాసీ ప్రజలతో ఆయన కొద్దిసేపు సరదాగా గడిపారు.ఈ సందర్భం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇక ఈ సందర్భం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పునస్కరించుకొని విజయవాడ( Vijayawada )లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలని పెద్ద ఎత్తున నిర్వహించారు అధికారులు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సమయంలో చంద్రబాబుకు ఆదివాసీ మహిళలు, ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో ఆదివాసీ మహిళలతో కలిసి చంద్రబాబు సంప్రదాయ నృత్యం చేయగా అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఆపై ఆయన డప్పు కూడా వాయించారు.ఇంకా ఆయన ఆదివాసీ ప్రజలతో సరదాగా మాట్లాడారు.ఆపై అరకు కాపీ ఉత్పత్తులను బాబు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు అరకు కాఫీ రుచి చూశారు కూడా.

ఈ సంద్రాభంగా అరకు కాఫీ మార్కెటింగ్ అంశాలపై ఆయన అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.ఇంకా ఆదివాసీ జీవనశైలిలో ఉపయోగించే పనిముట్లను ఆసక్తిగా తిలకించి.

, గిరిజనుల తేనెను కొనుగోలు చేశారు ముఖ్యమంత్రి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube