తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నారు.నిజానికి ఒక హీరో సినిమా చేస్తున్నాడు అంటే చాలు ఆ సినిమా మీద అంచనాలు భారీ స్థాయి లో పెరిగిపోతుంటాయి.
ఇక దానికి తగ్గట్టుగానే మన హీరోలు కూడా మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉండడమే కాకుండా భారీ సక్సెస్ లను కూడా అందుకోవాలని చూస్తున్నారు.
ఇక ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో మన హీరోలు పాగా వేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇంకా ఇప్పుడు రాబోయే సినిమాలతో కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని నెంబర్ వన్ హీరోలుగా ఎదగాలని అందరూ పోటీ పడుతున్నారు… ఇక ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు.అయినప్పటికీ ఆయనకు పాన్ ఇండియాలో మంచి గుర్తింపు అయితే ఉంది.ఇక ఇప్పుడు ఆయన సుజీత్( Sujeet ) డైరెక్షన్ లో చేస్తున్న ఓజి సినిమాతో పాన్ ఇండియాలో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటునే ఇటు సినిమాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక మన దేశ ప్రధాని అయిన మోడీ ( Modi )పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటంతో ఒక్కసారిగా ఆయన పేరు ఇండియా వైడ్ గా పెద్ద స్థాయిలో వినిపిస్తుందనే చెప్పాలి…ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇక ఆయన కూడా ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడు…
.