చలికాలంలో అధిక శాతం మందిని అత్యధికంగా వేధించే సమస్యల్లో జలుబు, దగ్గు ముందు వరుసలో ఉంటాయి.చలికాలంలో సహజంగానే రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది.
దాంతో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు తరచూ ఎటాక్ చేస్తూ ఉంటాయి.వీటి వల్ల ఏ పని పైన దృష్టి సారించలేకపోతుంటారు.
ఒక్కోసారి జలుబు, దగ్గు కారణంగా జ్వరం కూడా వచ్చేస్తుంది.ఈ క్రమంలోనే వాటి నుంచి బయట పడటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్ట్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే కేవలం రెండు రోజుల్లోనే జలుబు, దగ్గు పరార్ అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఎఫెక్టివ్ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా అంగుళం అల్లం ముక్కను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పొట్టు తొలగించి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి.అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేసి రెండు గంటల పాటు వదిలేయాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వన్ టేబుల్ స్పూన్ చొప్పున రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.ఇలా చేస్తే రెండు రోజుల్లో జలుబు దగ్గు దూరం అవుతాయి.
అదే సమయంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.దాంతో సీసనల్ వ్యాధులు తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.అంతేకాదు అల్లం వెల్లుల్లి తేనే కలిపి తీసుకోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది.చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దీంతో గుండె జబ్బులు సైతం దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.