నాగచైతన్య సమంత విడిపోయి దాదాపుగా మూడేళ్లు అవుతున్న సంగతి తెలిసిందే.చైతన్య సమంత విడిపోయిన తర్వాత చైతన్య రెండో పెళ్లి గురించి పలు సందర్భాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే ఆ వార్తల్లో నిజం లేదని తర్వాత వార్తలు వినిపించాయి.చైతన్య శోభిత ధూళిపాళ్ల( Shobitha Dhulipalla ) పలు సందర్భాల్లో కలిసి కనిపించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది.
వీళ్లిద్దరూ కలిసి సినిమాలలో మాత్రం నటించలేదనే సంగతి తెలిసిందే.
నాగచైతన్య( Naga Chaitanya ) శోభిత నిశ్చితార్థం అంటూ ఈరోజు ఉదయం నుంచి వార్తలు చక్కర్లు కొట్టగా ఆ వార్తలే ఎట్టకేలకు నిజమయ్యాయి.
ఈరోజు ఉదయం 9 గంటల 42 నిమిషాలకు నిశ్చితార్థ కార్యక్రమం జరగడం గమనార్హం.స్వయంగా నాగార్జున( Nagarjuna ) చైతన్య శోభిత నిశ్చితార్థం గురించి వెల్లడించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
కొడుకు, కాబోయే కోడలితో నాగ్ దిగిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
మొదట విదేశాల్లో చైతన్య శోభిత దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.ఈ ఏడాదే చైతన్య శోభిత పెళ్లి( Chaitanya Shobitha Marriage ) వేడుక జరగనుందని పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాగచైతన్య వయస్సు ప్రస్తుతం 37 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.
చైతన్య శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఐదేళ్లు అని తెలుస్తోంది.
చైతన్య, శోభిత ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం నెలకొంది.తండేల్( Thandel ) సినిమాకు ఒకింత రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.
చైతన్య సమంతతో కలిసి దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా తొలగించారని తెలుస్తోంది.