టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు నందమూరి బాలకృష్ణ( Balakrishna ) ఒకరు.ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చే సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో చిత్ర పరిశ్రమ ఈయనని ఘనంగా సత్కరించనున్నారు.
ఇలా బాలకృష్ణ 50 సంవత్సరాల పూర్తి చేసుకోవడంతో ఇటీవల దర్శక నిర్మాతలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.ఇందులో భాగంగా ప్రముఖ నటుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్( Thammareddy Bhardwaj ) బాలయ్య గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువేనని వెల్లడించారు.ఆయన నందమూరి తారక రామారావు కుమారుడు ఒక స్టార్ హీరో అనే గర్వం తనలో లేదని చాలా సింపుల్ గా ఉంటారని తెలిపారు.ఒకసారి నేను బాలయ్య ఇద్దరు గోవా వెళ్ళామని ఇద్దరు కారులో వెళుతుండగా ఆయన ఉన్న ఫలంగా కారు ఆపమని చెప్పి పక్కనే ఉన్న కొట్టులోకి వెళ్లి వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు.అదేంటి మనం వెళ్లే హోటల్లో ఉంటాయి కదా అని నేను బాలయ్యను అడిగితే అక్కడ వందలు పెట్టి కొనడం ఎందుకు అంటూ చాలా సింపుల్ గా సమాధానం చెప్పారని తమ్మారెడ్డి భరద్వాజ్ వెల్లడించారు.
ఇక ఒకసారి హీరో వస్తున్నారు అంటే ఆయన చుట్టూ ఒక పదిమంది బౌన్సర్స్ ఉంటారు కానీ బాలయ్యకు ఇప్పటి వరకు బౌన్సర్స్( Bouncers ) అవసరం రాలేదని తెలిపారు.ఎక్కడికి వెళ్లినా సింగిల్గానే వెళ్తారు.ఇక ఆయన తన అభిమానులను బౌన్సర్స్ తో కొట్టించరు.ఆయనే లాగి పెట్టి రెండు పీకుతారని ఈ సందర్భంగా బాలయ్య గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక బాలయ్య ఇండస్ట్రీ లోకి వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది అంటే నమ్మశక్యం కాదని ఇప్పటికీ ఆయన యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలలో నటిస్తున్నారని తమ్మారెడ్డి బాలయ్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.