సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) పుట్టినరోజు కావడంతో ఈరోజును మహేష్ బాబు అభిమానులు పండగలా జరుపుకోవడం గమనార్హం.సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్నారు.
చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం మహేష్ బాబు తన సంపాదనలో ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారని ఈ మొత్తం తన సంపాదనలో 30 శాతం అని భోగట్టా.
మహేష్ బాబు ప్రస్తుతం 50 కోట్ల రూపాయలకు( 50 crore ) అటూఇటుగా సేవా కార్యక్రమాల కోసం, చిన్న పిల్లల వైద్య చికిత్స కోసం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమాతో మూడేళ్ల పాటు బిజీ కానుండటంపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మహేష్ బాబు ఇదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మహేష్ బాబు ఆస్తుల విలువ 330 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు మహేష్ బాబు సొంతంగా కూడబెట్టిన ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయని సమాచారం అందుతోంది.మహేష్ బాబు కోసం జక్కన్న అద్భుతమైన కథను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది.మహేష్ బాబు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సు 49 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా మహేష్ బాబు అదిరిపోయే లుక్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.మహేష్ బాబు రాబోయే రోజుల్లో ఏ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తారనే చర్చ జరుగుతోంది.సూపర్ స్టార్ మహేష్ బాబు అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.మహేష్ బాబుకు ఇతర భాషల ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.