బిజెపి విషయంలో వైసీపీ అధినేత జగన్ ( YS Jagan Mohan Reddy )కీలక నిర్ణయం తీసుకున్నట్టుగానే కనిపిస్తున్నారు.ఏపీలో ఎన్నికలకు ముందే టీడీపీ, జనసేన ,బిజెపిలు పొత్తు పెట్టుకోవడం, ఎన్నికల్లో విజయం సాధించడం వంటి పరిణామాలు జరిగాయి .
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా .అధికారంలో ఉన్నా.బిజెపికి మద్దతు గానే ఉంటూ వస్తుంది.నేరుగా బిజెపికి మద్దతు ఇవ్వకపోయినా, పరోక్షంగా అనేక బిల్లులకు వైసిపి మద్దతు ఇచ్చింది రాజ్యసభలో వైసిపి బిజెపికి అండగా ఉండడంతోనే అనేక బిల్లులు పాస్ అయ్యాయి.
బిజెపి అగ్ర నేతలతో సన్నిహితంగా ఉండేందుకే జగన్ మొగ్గు చూపించేవారు. అన్ని అంశాల్లోనూ కేంద్రంలోని బిజెపికి మద్దతుగా జగన్ నిలిచేవారు.అసలు ఏపీలో టిడిపి అయినా వైసీపీ అయినా బిజెపికి అనుకూలంగా ఉండేవారు. వైసీపీ, జనసేన, టిడిపి( YCP, Janasena, TDP ) మద్దతు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ బిజెపికి దక్కేవి.
ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించడం, వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయిన దగ్గర నుంచి బిజెపి విషయంలో జగన్ వైఖరి మారినట్టుగా కనిపిస్తోంది .
![Telugu Ap, Asaduddin Oyc, Kiran Rijuju, Mim, Telugu Desamy, Vakboard, Ysrcp-Poli Telugu Ap, Asaduddin Oyc, Kiran Rijuju, Mim, Telugu Desamy, Vakboard, Ysrcp-Poli](https://telugustop.com/wp-content/uploads/2024/08/ysrcp-TDP-Telugu-Desamparty-cpi-cpm-mim-party-Kiran-rijuju-asaduddin-oyc.jpg)
తాజాగా జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే బిజెపికి దూరం అవుతున్నట్లుగానే వ్యవహారం ఉంది . నేరుగా విమర్శలు చేయకపోయినా , కొన్ని అంశాల్లో విభేదిస్తున్నట్లుగానే జగన్ వ్యవహరిస్తున్నారు.తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను కూడా బిజెపి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తుందన్న అనుమానాలు జగన్ కు ఉన్నాయి.
ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలతో బిజెపి నేతలు టచ్ లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయ్యారు.ప్రధానంగా బిజెపి కూటమితో దూరం పాటించాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
తాజాగా లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైసిపి వ్యతిరేకించింది. టిడిపి ,జనసేన లు ఈ బిల్లును సమర్ధించినా, వైసీపీ మాత్రం లోక్ సభలో వ్యతిరేకించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
![Telugu Ap, Asaduddin Oyc, Kiran Rijuju, Mim, Telugu Desamy, Vakboard, Ysrcp-Poli Telugu Ap, Asaduddin Oyc, Kiran Rijuju, Mim, Telugu Desamy, Vakboard, Ysrcp-Poli](https://telugustop.com/wp-content/uploads/2024/08/TDP-Telugu-Desamparty-cpi-cpm-mim-party-Kiran-rijuju-asaduddin-oyc-vakboard.jpg)
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు( Kiren Rijiju ) ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వైసిపి వ్యతిరేకించింది .ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను వైసిపి సమర్ధించింది. వైసీపీ, టీఎంసీ సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ , మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి .దీంతో ఏపీలో కమ్యూనిస్టులను కలుపుకుని అధికార ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు జగన్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.వక్ఫ్ సవరణ బిల్లును వైసిపి వ్యతిరేకించడం ద్వారా తాము బిజెపి కి దూరమయ్యామనే సంకేతాలను ఇస్తూ, మిగతా పార్టీలను దగ్గర చేసుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.