ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం వికటించి పేషెంట్ మృతి...!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో జమ్మిగడ్డ హెల్తీ ఫై ఆస్పత్రిలో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి మొదట ఓ ఇంజక్షన్ వేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే మరో ఇంజక్షన్ వేయడంతో మృతి చెందాడు.ఈ విషయం మృతుని బంధువులకు తెలిసేలోపు మృతుని అంబులెన్స్ లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి అక్కడే చనిపోయినట్లు ప్రభుత్వ వైద్యంపై నెట్టేందుకు ప్రయత్నం చేశారని కుటుంబ సభ్యుల,బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడంతో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది.

 Patient Died Due To Medical Malpractice In Private Hospital, Patient , Died, Pr-TeluguStop.com

ఈ సందర్భంగా మృతుని బంధువులు మాట్లాడుతూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం( Jajireddygudem mandal ) రామన్నగూడెం గ్రామానికి చెందిన శివరాత్రి ఇద్దయ్య (62) జమ్మిగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి( Private hospital )లో మోకాలి నొప్పి చికిత్స కోసం చేరాడు.

అయితే ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ కు మొదట ఒక ఇంజక్షన్ వేయడంతో అపస్మాక స్థితిలోకి వెళ్ళాడు.దీంతో ఏదో జరుగుతుందని గమనించి మరో ఇంజక్షన్ వేయడంతో రోగి మృతి చెందాడు.

ఈ విషయాన్ని ఆసుపత్రి నిర్వాహకులు కప్పిపుచ్చుకునేందుకు ఠాగూర్ సీన్ ను క్రియేట్ చేశారు.బంధువులకు సమాచారం ఇవ్వకుండా చనిపోయిన పేషెంట్ ను సైలెంట్ గా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కి తరలించారు.

తమకు చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కు మృతున్ని తరలించారని ఆస్పత్రి సిబ్బంది వేసిన ఇంజక్షన్ల వల్లనే రోగి మృతి చెందాడని,దీని కప్పిపోవచ్చినందుకు ఏరియా ఆసుపత్రికి తరలించారని రోగి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube