Turmaric Water : ఉదయం నిద్ర లేవగానే.. ఈ నీటిని తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ఉదయం నిద్ర లేవగానే నీటిని తాగే అలవాటు ఉంటుంది.అలాగే కొంత మంది గోరువెచ్చని నీటిని కూడా తాగుతూ ఉంటారు.

 When You Wake Up In The Morning If You Drink This Water These Are The Changes T-TeluguStop.com

మరి కొందరు నార్మల్ నీళ్లను కూడా తాగుతూ ఉంటారు.అయితే ఇవి కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పసుపు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.అలాగే పసుపులో ఎన్నో రకాల యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు( Antibacterial properties ) ఉంటాయి.

ఇవి కడుపులోని చెడు బ్యాక్టీరియాని చంపి జీవ క్రియను మెరుగు పరుస్తుంది.దీని వల్ల కడుపు సంబంధించిన సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు.

Telugu Cough, Headache, Honey, Lemon, Muscle Aches, Turmaric-Telugu Health

ముఖ్యంగా పసుపు నీళ్లు ( Turmaric water ) పెయిన్ కిల్లర్ లాగా పని చేస్తాయి.వీటిని తాగడం వల్ల కండరాల నొప్పులు, తలనొప్పి( Muscle aches, headache ) కూడా దూరమవుతాయి.ఇది వంటకు రంగుతో పాటు రుచికరంగాను ఉంటుంది.అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని అంటారు.ఇది క్యాన్సర్ తో పోరాడి డిప్రెషన్ ను దూరం చేస్తుంది.పసుపులో ఉండే ఎన్నో సమ్మేళనాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

అలాగే మీరు ప్రతి రోజు ఉదయాన్నే పసుపు నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.మరి ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Cough, Headache, Honey, Lemon, Muscle Aches, Turmaric-Telugu Health

చాలా మంది పదేపదే దగ్గు, జలుబు( Cough, cold ) వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారు పసుపు నీటిని తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.అలాగే పసుపు నీళ్లను క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది.పసుపు నీళ్లను ఇలా తయారు చేసుకోవాలి.ముందుగా నీటిని బాగా మరిగించాలి.తర్వాత దానిలో సొంపు, అల్లం ముక్కలు, కాస్త పసుపు వేయాలి.

ఆ తర్వాత ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగించాలి.చల్లార్చిన తర్వాత దానికి తేనె, నిమ్మరసం కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో, సాయంత్రం ఈ నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులైన దూరమవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube