అరికెలతో చేసిన లడ్డులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర లాభాలు..

ప్రస్తుత సమాజంలో చాలామందికి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే చాలామంది అధిక బరువు డయాబెటిస్ థైరాయిడ్ ఉంటే సమస్యలతో బాధపడుతూ జీవితాంతం మందులను వాడుతున్నారు.

 There Are Many Health Benefits Of Eating Laddus Made With Rice Flour , Laddu ,-TeluguStop.com

అయితే ఇలాంటి మందులు వాడే పని లేకుండా వీటి నుంచి బయట పడాలంటే కొన్ని మనం తినే ఆహారంలోనే ఔషధారణంగా తీసుకోవాలి.

ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలగాలంటే చిరుధాన్యాలు ఆహారంలో తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

వాటిలో చిరుధాన్యాలైన అరికెలు కూడా ఒకటి.వీటిని నేరుగా తినకుండా వీటితో లడ్డులను తయారు చేసి రోజుకి ఒకటి తింటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.

ఇక అరికెలతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.అరికెల లడ్డూలను తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు,అరికెల పిండి – 2 కప్పులు,నువ్వులు – అర కప్పు, బెల్లం – 1 కప్పు, పల్లీలు – అర కప్పు, ఎండు కొబ్బరి పొడి – అర కప్పు, బాదం పప్పు – అర కప్పు, నెయ్యి – 10 గ్రాములు.

Telugu Diabetes, Healt Tips, Tips, Jaggery, Thyroid-Telugu Health

అరికెల లడ్డూలను తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మొదటి గా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి.వేడి అయ్యిన నెయ్యిలో అరికెల పిండి వేసి బాగా వేయించాలి.తరువాత వేరుశనగలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుమును వేరు వేరుగా వేయించుకోవాలి.వీటిని ఒక మిక్సి లో తీసుకుని బెల్లం, అరికెల పిండి కలిపి మిక్సి పట్టాలి.ఈ మిశ్రమాన్ని ఒక పాత్ర లోకి తీసుకుని కట్ చేసుకున్న బాదం ముక్కలు వేసి వేడి చేసిన నెయ్యి వేస్తూ లడ్డూలుగా చేస్తే చాలు.

అంతే ఎంతో ఆరోగ్యకరమైన అరికెల లడ్డూలు రెడీ అయినట్టే.వీటిని రోజుకు ఒకటి తింటే శరీరానికి ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube