ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి విశేష సేవలు అందించిన నటీమణులకు, ఇతర సినీ సెలబ్రిటీలకు పద్మ విభూషణ్, పద్మశ్రీ వంటి అవార్డులు లభిస్తున్నాయి.ఒకప్పుడు సినిమాల్లో విశేషమైన కాంట్రిబ్యూషన్స్ చేసిన వారికి కూడా ఇలాంటి అవార్డు లభించాయి.కానీ కళాభినేత్రి, అద్భుత నటి వాణిశ్రీకి( Vanisri ) మాత్రం పద్మ విభూషణ్, పద్మశ్రీ వంటి అత్యున్నత పౌర పురస్కారాలు ఏవీ అందించలేదు.40 ఏళ్ల సినీ కెరీర్లో వాణిశ్రీ 200 సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించింది.హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.పెళ్లయిన తర్వాత ఆమె తల్లిగా కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అల్లరించింది.
ఆమె కోట్లాదిమంది తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయింది.
సినీ ఇండస్ట్రీకి ఇంత చేసినా కేంద్ర ప్రభుత్వం ఆమెను గుర్తించలేకపోవడం చాలా బాధాకరం.ఆమెకు కో-యాక్టర్స్ శారద,( Sharada ) లక్ష్మీలకు( Laxmi ) జాతీయ అవార్డులు వచ్చాయి కానీ వాణిశ్రీ కి మాత్రం కేంద్రం నుంచి ఎలాంటి పురస్కారం లభించలేదు.ఎన్నో పాత్రలను అవలీలగా పోషిస్తూ అగ్రతారగా ఎదిగిన వాణిశ్రీ కి ఎందుకు అవార్డు ఇవ్వలేదు అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టని విషయం.1978లో రిలీజ్ అయిన అనుగ్రహం సినిమాలో( Anugraham Movie ) వాణిశ్రీ చాలా బాగా నటించింది.అందుకే ఆ నటనకు బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డు వస్తుందని వాణిశ్రీ అనుకుంది కానీ నిరాశే ఎదురయింది.
ఆ సంవత్సరం “భూమిక” అనే బెంగాల్ సినిమాలో నటించిన స్మిత పటేల్ అనే నటికి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు వచ్చింది.ఒకే ఒక్క ఓటుతో ఆమె ఈ అవార్డును కోల్పోయింది.అయితే ఈ అవార్డు వచ్చిన వారే గొప్ప నటులనేం కాదు.మహానటి సావిత్రి కి, ఎస్వీ రంగారావులకు కూడా పద్మ అవార్డ్స్ రాలేదు.నిజానికి సావిత్రి, ఎస్.వి.రంగారావులను యాక్టింగ్ లో చేయించేవారు లేరు కానీ కేంద్ర పురస్కారాలు ఇచ్చే న్యాయ నిర్ణీతలకు వీళ్లు కనిపించలేదు.అలా చేయడం అవార్డులకే అవమానం అని చెప్పుకోవచ్చు.
ఇక వాణిశ్రీ కి ఈ అవార్డు రాకపోవడం లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు అని చాలామంది అంటున్నారు.వాణిశ్రీ చాలా చాలెంజింగ్ పాత్రలు కూడా పోషించింది.
డ్యాన్స్ లు కూడా బాగా వేసింది.ప్రజల అభిమానమే ఆమెకు వందల పద్మ పురస్కారాలతో సమానమని చెప్పుకోవచ్చు.