భార్య భర్తల జీవితంలో చిన్న చిన్న తగాదాలు రావడం మామూలే.అయితే ఈ చిన్న తగాదాలను కొంతమంది పెద్దగా చేసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక విషయాలను ప్రతిరోజు మనం మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉంటున్నాం.ఇకపోతే తాజాగా విజయనగరం ( Vizianagaram)జిల్లాలోని రాజం మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
పెళ్లి అయిన యువకుడు తన భార్య తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా రాజాం మండలంలోని ఎల్లం నాయుడు ( Ellam Naidu )వలస గ్రామానికి చెందిన ఘంటసాల సత్యధర్( Ghantasala Satyadhar ) అనే వ్యక్తి తన భార్య అతడిని వదిలి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోవడంతో మన స్థాపన చెందాడు.దీంతో అతడు మనస్థాపానికి గురై చివరకు సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్య చేసుకున్న సమయంలో తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఆత్మహత్యకు పాల్పడిన సత్యధర్ కుటుంబ సభ్యులు విషయాన్నీ గ్రహించి వెంటనే అతనిని చికిత్స కోసం రాజాం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
అయితే, అక్కడ మెరుగైన చికిత్స అందించేందుకు అతడిని వెంటనే శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.కాకపోతే ద్రువదృష్టశాత్తు అతడు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ఏవైనా గొడవలు ఉంటే ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవాలి కానీ.ఇలా శనికావేశంలో ప్రాణాలు తీసుకుంటే పిల్లల జీవితాలు ఏమైపోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.