సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా పోటీ నెలకొంటుంది.ముఖ్యంగా హీరోయిన్ల మధ్య ఈ పోటీ ఎప్పుడూ చాలా ఎక్కువగానే ఉంటుంది.
కొత్తగా ఇండస్ట్రీలోకి హీరోయిన్లు వస్తూనే ఉంటారు.వాళ్లు ఒక్క హిట్ కొడితే దర్శకనిర్మాతలు వారి వెంటే పడతారు.
ఫలితంగా ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోయిన్లు ఆటోమేటిక్‌గా సినిమా అవకాశాలను కోల్పోతారు.కొంతమంది హీరోయిన్లు అయితే ఫస్ట్ సినిమాతో పెద్ద హిట్ సాధించారు.
తర్వాత వారికి అవకాశాలు రాకుండా కొత్త హీరోయిన్లు వారి అవకాశాలను ఎగరేసుకుపోయారు.అలాంటి హీరోయిన్లు, వారి ఆఫర్లను లాగేసుకున్న ఇతర యాక్ట్రెస్‌లు ఎవరో తెలుసుకుందాం.
• కృతి శెట్టి – శ్రీలీల
సూపర్ 30 సినిమాలో స్టూడెంట్‌గా కనిపించి మెప్పించింది కృతి శెట్టి.( Krithi Shetty ) అదే ఆమె మొదటి సినిమా.2021లో తెలుగులో ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ఈ మిల్కీ బ్యూటీ అందాలకు, ముచ్చటైన హావభావాలకు తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.“జలజల జల పాతం నువ్వు” పాటలో కృతి సూపర్ హాట్‌గా నటించి చాలామంది ఈ కుర్రాల హృదయాలు దోచేసింది.మంచి అందం అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉండటం వల్ల ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ రంగాన్ని ఏలేస్తుందని చాలామంది అనుకున్నారు కానీ అలా జరగలేదు.
ఈమెకు రావలసిన ఆఫర్లు అన్నిటినీ శ్రీలీల( Sreeleela ) ఎగరేసుకుపోయింది.సందడి, ధమాకా సినిమాలతో శ్రీలీల ఒక్కసారిగా టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.ఆ తర్వాత అందరూ ఆమెకే హీరోయిన్ ఆఫర్లు అందించారు ఒకేసారి ఆమె 10కి పైగా సినిమాలకు సైన్ చేసింది.మంచి సినిమాలన్నీ ఆమెకు వెళ్లిపోవడంతో కృతికి ఫ్లాప్ సినిమాలు వచ్చాయి.
ఫలితంగా ఆమె తెలుగు ఇండస్ట్రీ నుంచి జస్ట్ మూడు ఏళ్లలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది.ఇప్పుడు తమిళం, మలయాళం సినిమాలు చేసుకుంటోంది.
• సాయి పల్లవి – రష్మిక మందన్న
ఫిదా(2017) సినిమాతో సాయి పల్లవి( Sai Pallavi ) చాలా గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో చాలా అవకాశాలు వస్తాయని అనుకున్నారు.కానీ అదే సమయంలో గీతగోవిందం సినిమాతో రష్మిక మందన్న( Rashmika Mandanna ) టాలీవుడ్‌లో ఒక్కసారిగా పాపులర్ అయింది.సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి ఆఫర్లను ఈమె పొందింది.
మరోవైపు సాయి పల్లవి తక్కువ ఆఫర్లు దక్కించుకుంది.రష్మిక పోటీగా రాకపోతే సాయి పల్లవికి మరిన్ని తెలుగు సినిమాలు వచ్చి ఉండేవి.
• భాగ్యశ్రీ
మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్‌గా చేసిన భాగ్యశ్రీ( Bhagyashri ) కొద్దిగా రష్మిక, కొద్దిగా కీర్తి సురేష్‌లాగా కనిపిస్తుంది.మిస్టర్ బచ్చన్ హిట్ అయితే వారిద్దరి ఆఫర్లను ఈ ముద్దుగుమ్మ లాగేసుకునే అవకాశం ఉంది.