ఎస్జే సూర్య( SJ Suryah).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈయనకు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో విలన్ రోల్స్ లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు.అందులో భాగంగానే ప్రస్తుతం సూర్య రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్,కార్తీ నటిస్తున్నా సర్దార్ 2 కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 3, నాని నటిస్తున్న సరిపోదా శనివారం లాంటి పెద్ద పెద్ద సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
నాని( Nani ) హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్నారు సూర్య.కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సరిపోదా శనివారం ( Saripodhaa Sanivaaram )గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.నాని చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి.అలాంటి నేచర్ తోనే పెరుగుతాడు.అయితే ఇలానే పెద్దయితే చాలా ప్రాబ్లమ్ అవుతుందని వాళ్ల అమ్మ అనుకుంటుంది.
ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని ఆలోచిస్తుంది.ఇలా చేయకూడదని చెబితే చిన్న పిల్లలు ఇంకా ఎక్కువ చేస్తారు.అందుకనే ఒక ఆలోచన చేసి నీ కోపం చూపించు కానీ అన్నీ రోజులు వద్దు, కేవలం ఒక్క రోజు చూపించు అని చెబుతుంది.దీంతో నాని అలా ఒక రీజన్ కోసం తన కోపం చూపించడానికి శనివారం ఎంచుకుంటాడు.
అలా అమ్మకి ఇచ్చిన మాట వల్ల ఆదివారం నుంచి శుక్రవారం వరకూ నాని బాషా సినిమా( Baashha )లో మాణిక్యం టైపు, శనివారం మాత్రం బాషా.అలా నాని ఈ సినిమాలో శనివారం బాషా అన్నమాట అంటూ ఎస్‌జే సూర్య తెలిపారు.
ప్రస్తుతం సూర్య చేసిన వాక్యాలు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోని చూసిన అభిమానులు ఏంటి సార్ మాటల్లో సినిమా కథలో రివీల్ చేసేసారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.