జై బాలయ్య.( Jai Balayya ) ఈ స్లోగన్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే.
ఏ హీరో సినిమా రిలీజ్ రిలీజ్ అయిన థియేటర్లలో మొదటిగా వినిపించే స్లోగన్ జై బాలయ్య.ఒక్క సినిమా థియేటర్లో అని కాకుండా చాలా చోట్ల ఈ స్లోగన్ వినిపిస్తూనే ఉంటుంది.
ఈ స్లోగన్ వినగానే అభిమానుల్లో ఆనందం టన్నుల కొద్దీ బయటకు తన్నుకుని వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.సమయం సందర్భం లేకుండా కూడా అభిమానులు ఈ స్లోగన్ ని విచ్చలవిడిగా వాడేస్తుంటారు.
ఈ స్లొగన్ మీద వీర సింహారెడ్డిలో ఒక డైలాగ్ కూడా ఉంది.
వీరసింహారెడ్డి( Veerasimha Reddy ) సినిమాల్లో.పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి అడుగు.అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది అనగానే.
జై బాలయ్య.అంటూ వాయిస్ వస్తుంది గతంలో డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లిలో ఎన్టీఆర్ జై బాలయ్య అంటూ స్లోగన్ చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఇలా జై బాలయ్య అని ఎందుకంటారు అనే సందేహం చాలా మందికి కలుగుతుంది.దానికి బోయపాటి శ్రీను( Boyapati Srinu ) సమాధానం ఇచ్చారు.
కాగా బాలకృష్ణ( Balakrishna ) నట ప్రస్థానానికి ఈ ఏడాదితో 50 ఏళ్లు.ఈ సందర్భంగా సెప్టెంబరు 1న హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించనున్నారు.
బుధవారం కర్టెన్ రైజర్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
బోయపాటి శ్రీను, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్బంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.గతంలో దర్శకులు కోదండ రామిరెడ్డి గారు ఓ సారి బాలయ్య ని ఇదే ప్రశ్న అడిగితే ఆయన నవ్వేసి ఊరుకున్నారు.
అయితే అసలు విషయం ఏమిటంటే.పేరు బాగుందని జై బాలయ్య అనట్లేదు, దాని వెనుక ఎనర్జీ ఉంది.
ఆ ఎనర్జీ కోసమే అందరూ జై బాలయ్య అంటుంటారని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.ఇకపోతే బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.